మంచు విష్ణు హాలీవుడ్ సినిమా... చివరి దశకి షూటింగ్

టాలీవుడ్ లో మంచు మోహన్ బాబు వారసుడుగా తెరంగేట్రం చేసి హీరోగా తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు మంచు విష్ణు.ఇతనిలో హీరోగా నిలబడటానికి కావాల్సిన అన్ని రకాలా స్కిల్స్ ఉన్న కూడా ఏ కారణంగానో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు.

 Manchu Vishnu Kajal Jeffrey-TeluguStop.com

హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఇతని కెరియర్ లో ఫ్లాప్ సినిమాలే ఎక్కువ.అయిన కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా హీరోగా సక్సెస్ అయ్యేందుకు విష్ణు అన్నిరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పుడు టాలీవుడ్ లో ఏ హీరో చేయని సాహసం ఇతను చేస్తున్నాడు.

ఏకంగా హాలీవుడ్-ఇండియన్ ప్రొడక్షన్ లో తెరకెక్కే హాలీవుడ్, ఇండియా మూవీలో హీరోగా మంచు విష్ణు నటిస్తున్నాడు.

మోసగాళ్లు టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ఇంగ్లీష్ తో పాటు, తెలుగు, హిందీ భాషలలో కూడా రిలీజ్ కాబోతుంది.ఈ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మెజారిటీ కథ అమెరికా నేపధ్యంలో నడుస్తుంది.జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన కీలక సన్నివేశాల చిత్రీకరణను తాజాగా ప్రారంభించారు.పది రోజుల పాటు ఈ షెడ్యూల్ ఫినిష్ చేసి సినిమాకి గుమ్మడి కాయ కొట్టే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఇందులో కాజల్ ఆగర్వాల తో పాటు, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రలు చేస్తున్నారు.మరి కెరియర్ లో హాలీవుడ్ సినిమా చేస్తున్న మొదటి తెలుగు హీరోగా మంచు విష్ణు ఈ సినిమాతో ఎంత వరకు సక్సెస్ అవుతాడు అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube