టికెట్ రేట్ల సమస్యపై స్పందించిన మంచు విష్ణు.. వాళ్లు చూసుకుంటారంటూ?

ఏపీలో టికెట్ రేట్ల సమస్య వల్ల పెద్ద సినిమాల నిర్మాతలు కొంత మొత్తం నష్టపోతున్నారు.టికెట్ రేట్లు తగ్గడంతో గతంతో పోలిస్తే థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతున్నా స్టార్ హీరోలు గత సినిమాల స్థాయిలో తమ సినిమాల ద్వారా కలెక్షన్లను సొంతం చేసుకోవడంలో మాత్రం ఫెయిల్ అవుతుండటం గమనార్హం.

 Manchu Vishnu Interesting Comments About Ap Ticket Rates Issue , Interesting Fac-TeluguStop.com

అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు టికెట్ రేట్ల గురించి ఇప్పటివరకు స్పందించలేదు.

మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షునిగా బాధ్యతలను స్వీకరించి 100 రోజులైంది.

అయితే తాజాగా మంచు విష్ణు టికెట్ రేట్ల సమస్య గురించి స్పందించారు.ఇండస్ట్రీ పెద్దలు సినిమా టికెట్ రేట్ల సమస్యకు సొల్యూషన్ ను వెతుకుతున్నారని విష్ణు అన్నారు.

సమస్యకు సొల్యూషన్ దొరుకుతుందనే కాన్ఫిడెన్స్ తో తాను ఉన్నానని వ్యక్తిగతంగా ఈ సమస్య గురించి మాట్లాడటం సరికాదని విష్ణు అభిప్రాయపడ్డారు.

ఛాంబర్ పెద్దలు జగన్ సర్కార్ తో చర్చలు జరుపుతున్నారని ఎవరు పడితే వాళ్లు టికెట్ రేట్ల సమస్య గురించి మాట్లాడితే సమస్య మరింత పెద్దదయ్యే ఛాన్స్ అయితే ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

విష్ణు చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతుండగా కొంతమంది ఈ కామెంట్ల గురించి పాజిటివ్ గా స్పందిస్తుంటే మరి కొందరు ఈ కామెంట్ల గురించి నెగిటివ్ గా స్పందిస్తుండటం గమనార్హం.

Telugu Manchu Vishnu, Ticket Rates-Movie

మంచు విష్ణు ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పదవిలో ఉన్నారని ఆయన స్పందించినా తప్పు లేదంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్ల గురించి విష్ణు స్పందిస్తారో లేదో చూడాల్సి ఉంది.మరోవైపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అభివృద్ధి కోసం మంచు విష్ణు కృషి చేస్తున్నారు.

ఇందుకోసం మంచు విష్ణు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube