మా ఎన్నికల్లో వార్ వన్ సైడ్.. విష్ణు గెలుపుకు అసలు కారణాలివే..?

గడిచిన ఆరు వారాలుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి సినీ ప్రేక్షకుల మధ్య జోరుగా చర్చ జరుగుతోంది.అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నామని ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్రకటించిన సమయంలో చాలామంది ప్రకాష్ రాజ్ అధ్యక్షుడిగా గెలుస్తాడని విష్ణు గెలవడం కష్టమని కామెంట్లు చేశారు.

 Manchu Vishnu Huge Shock To Prakash Raj In Maa Elections, Manchu Vishnu, Maa Ele-TeluguStop.com

ఆన్ లైన్ పోల్స్ లో సైతం విష్ణుకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయి.అయితే విష్ణు మాత్రం తెలివిగా అడుగులు వేశారు.

ఇండస్ట్రీ పెద్దలను కలిసి వాళ్ల మద్దతు తీసుకోవడం విష్ణుకు ప్లస్ అయింది.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో విష్ణు విజయం సాధించారు.మరికాసేపట్లో విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటన రానుంది.మంచు విష్ణుకు ఏకంగా 381 ఓట్లు రాగా 107 ఓట్లకు పైగా మెజారిటీ రావడం గమనార్హం.

అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్లడం విష్ణుకు ప్లస్ అయింది.

తొలి రౌండ్ నుంచి మంచు విష్ణు ఆధిక్యంతో దూసుకెళ్లడం గమనార్హం.విష్ణు తెలుగువాడు కావడం ప్రకాష్ రాజ్ గెలిచినా అందుబాటులో ఉంటాడో లేదో అనే సందేహాలు వ్యక్తం కావడం వల్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు సైతం విష్ణుకే మద్దతు ప్రకటించారని తెలుస్తోంది.ఈసీ మెంబర్స్ లెక్కింపులో ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి 11 మంది గెలుపొందగా విష్ణు ప్యానల్ నుంచి 7 మంది గెలుపొందారు.

విష్ణు ఆధిక్యం కనబరిచి ప్రకాష్ రాజ్ ను కుదేలయ్యేలా చేశారు.ప్రకాష్ రాజ్ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తానని భావించగా ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయి.ప్రకాష్ రాజ్ కు మెగా కుటుంబం మద్దతు ఇచ్చినా ఇతర హీరోలు సపోర్ట్ చేయకపోవడం మైనస్ గా మారింది.మూవీ అర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాల విషయంలో ప్రకాష్ రాజ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

ఇతర రాష్ట్రాల్లో ఉన్న సెలబ్రిటీలను రప్పించడం, అద్భుతమైన వాగ్దానాలతో మ్యానిఫెస్టో ప్రకటించడంతో విష్ణు సునాయాసంగా గెలుపొందారు.

Remove term: 400 above majority
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube