నాగబాబుకు భారీ షాకిచ్చిన మంచు విష్ణు.. ఆ విమర్శలకు చెక్ పెడుతూ?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన రోజే ఫలితాలు కూడా వెలువడ్డాయి.మంచు విష్ణు 107 ఓట్ల ఆధిక్యంతో ఎన్నికల్లో విజయం సాధించగా ప్రకాష్ రాజ్ కు కేవలం 274 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి.

 Manchu Vishnu Huge Shock To Nagababu With Movie Artist Association Elections Det-TeluguStop.com

ప్రకాష్ రాజ్ కు మెగా ఫ్యామిలీ బ్యాకప్ ఉన్న సంగతి తెలిసిందే.అయితే మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా ప్రకాష్ రాజ్ మాత్రం భారీ తేడాతో ఓడిపోవడం గమనార్హం.

మెగా ఫ్యామిలీకి ఇండస్ట్రీపై పట్టు ఉన్న సంగతి తెలిసిందే.

మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోలలో ఎక్కువమంది హీరోలు సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.

నాగబాబు ప్రకాష్ రాజ్ కు బహిరంగంగా మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఎన్నికల ఫలితాలతో నాగబాబుకు భారీ షాక్ తగిలిందనే చెప్పాలి.నాగబాబు విష్ణు గురించి కామెంట్లు చేస్తూ విష్ణు తెలుగు పరీక్షలో పాస్ మార్కులు కూడా సాధించలేడని కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.

అయితే క్యారెక్టర్ విషయంలో మాత్రం తనకే ఎక్కువ మార్కులు వస్తాయంటూ విష్ణు నాగబాబుకు ధీటుగా కౌంటర్ ఇవ్వడం జరిగింది.

Telugu Chiranjeevi, Shock, Maa, Manchu Vishnu, Artist, Nagababu, Pawan Kalyan-Mo

ప్రకాష్ రాజ్ గెలుపు కోసం నాగబాబు కష్టపడినా చిరంజీవి, పవన్ కళ్యాణ్ బహిరంగంగా మద్దతు ప్రకటించి ఉంటే ప్రకాష్ రాజ్ కు గెలిచే అవకాశాలు కొంతవరకు ఉండేవనే కామెంట్లు వినిపిస్తున్నాయి.మంచు విష్ణు ఉనికినే నాగబాబు ప్రశ్నించడంతో పాటు మంచు విష్ణు స్థానికతను నిలదీసిన సంగతి తెలిసిందే.

Telugu Chiranjeevi, Shock, Maa, Manchu Vishnu, Artist, Nagababu, Pawan Kalyan-Mo

అయితే నాగబాబు విమర్శలకు విష్ణు తన గెలుపుతో చెక్ పెట్టారు.నాగబాబు కోట శ్రీనివాసరావుపై ఘాటు విమర్శలు చేయగా ఆ విమర్శలు సైతం ప్రకాష్ రాజ్ కు మైనస్ అయ్యాయి.నాగబాబు వల్ల ప్రకాష్ రాజ్ కు జరిగిన మేలు కంటే చెడు ఎక్కువని కామెంట్లు వినిపిస్తున్నాయి.నాగబాబు ప్రకాష్ రాజ్ విషయంలో సరైన వ్యూహాన్ని అమలు చేయలేకపోయారనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube