Manchu Vishnu Ginna Movie : మంచు బాబును అక్కడ కూడా పట్టించుకోవడం లేదట పాపం

మంచు హీరో విష్ణు నటించిన జిన్నా సినిమా ఆ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.తెలుగుతో పాటు హిందీ, తమిళం మరియు మలయాళం భాషల్లో కూడా జిన్నా సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా మంచు విష్ణు హడావుడి చేశాడు.

 Manchu Vishnu Ginna Movie Ott Update ,manchu Vishnu, Film News, Ginna Movie, Su-TeluguStop.com

సన్నీలియోన్ ఉన్న కారణంగా దేశ వ్యాప్తంగా ఈ సినిమా కు మంచి ఆదరణ లభిస్తుందని ఆయన భావించాడు.సన్నీ లియోన్ ఉన్న కారణం గా సినిమా కు మంచి పబ్లిసిటీ అయితే దక్కింది.

కానీ సినిమా కు దక్కిన కలెక్షన్స్ మాత్రం శూన్యం అని చెప్పాలి.మరి దారుణంగా కోటి రూపాయల కలెక్షన్స్ కూడా జిన్నా సినిమా నమోదు చేయలేక పోయింది అనే టాక్ వచ్చింది.

Telugu Ginna, Manchu Vishnu, Sunny Leone, Telugu, Telugu Ott, Top-Movie

దాదాపుగా పాతిక కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన జిన్నా సినిమా థియేటర్ రిలీజ్ అయ్యి కోటి రూపాయలు కూడా రాబట్ట లేక పోవడంతో ఇప్పుడు అంతా ఓటిటి మరియు శాటిలైట్ ద్వారా ఏ మాత్రం సక్సెస్ దక్కించుకుంటుందో అంటూ ఎదురు చూశారు.ఎట్టకేలకు ఓటీటీ ద్వారా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అమెజాన్ ప్రైమ్ వారు ఈ సినిమా ను నిన్నటి నుండి స్ట్రీమింగ్ చేస్తున్నారు.విశ్వసనీయం గా అందుకున్న సమాచారం ప్రకారం అమెజాన్ లో కూడా జిన్నా సినిమా ను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదట.

అక్కడ ఏ మాత్రం వ్యూస్ రావడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.జిన్నా సినిమా తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా అందుబాటులో ఉంది.ఏ ఒక్క భాషలో కూడా ఈ సినిమా ను ప్రేక్షకులు చూస్తున్న దాఖలాలు లేవు.ఒకవేళ చూడడం మొదలు పెట్టిన కూడా చివరి వరకు ప్రేక్షకులు చూడడం లేదు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

సినిమా ఎంటర్టైన్మెంట్ పరంగా పరవాలేదు అన్నట్లుగా ఉంటుంది.కానీ మంచి విష్ణు ని కొందరు బ్యాడ్ ట్రోల్ చేస్తూ సినిమా ను విమర్శించారు.

అందుకే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో కూడా సినిమా ని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదని టాక్ వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube