ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల సమస్యలు, ప్రభుత్వ పనులతో బిజిబిజిగా గడుపుతు ఉంటాడు.
అలాంటిది నేడు మంచు విష్ణు, విరోనికా దంపతుల రాకతో జగన్ నవ్వుతూ వారితో కాసేపు ముచ్చటిస్తూ రిలాక్స్ అయ్యారు.వైయస్ రాజశేకర్ రెడ్డి తమ్ముడు దివంగత సుధాకర్ రెడ్డి కూతురు విరోనిక.
ఈమెను మంచు విష్ణు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.స్వయానా జగన్ మోహన్ రెడ్డి కి చెల్లెలు అవ్వుతుంది.
ఈ నేపథ్యంలో నేడు మంచు విష్ణు, విరోనికా తాడేపల్లి గూడెం లోని సిఎం క్యాంపు కార్యలయం కు వెళ్ళి జగన్ ను కలుసుకున్నారు.ఈ సందర్భంగా వారు ఫ్యామిలి విషయాలను మాట్లాడుకున్నట్లుగా సమాచారం.
ఈ క్రమంలోనే జగన్ మరియు ఆయన భారతి లతో కలిసి మంచు విష్ణు ఫ్యామిలీ లంచ్ కూడా చేశారు.ఆ తర్వాత మంచు విష్ణు జగన్ తో సెల్ఫి తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతుంది.
ఇది పూర్తి పర్సనల్ ట్రిపు మాత్రమే దీనిలో రాజకీయ ఉద్దేశం ఏమి లేదని అంటున్నారు.