మంటల్లో చీపురు, చాట వెయ్యండి.. అదేంటని ప్రశ్నించిన మనవరాలు?

Manchu Vishnu Family Bhogi Celebrations Pic Viral

సంక్రాంతి పండుగ వేడుకలు మొదలయ్యాయి.ఏపీ తెలంగాణ లో సంక్రాంతి పండుగను సామాన్యుల తో పాటు సినీ సెలబ్రిటీలు సైతం గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

 Manchu Vishnu Family Bhogi Celebrations Pic Viral-TeluguStop.com

భోగి పండుగ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది భోగి మంటలు, భోగి పండ్లు.భోగి మంటలు అంటే.

భోగి పండుగ రోజున సూర్యోదయానికి కంటే ముందుగా నిద్రలేచి, కాళ్ళు ముఖం, చేతులను శుభ్రంగా కడుక్కొని, అందరూ ఇంటి బయటకు చేరి ఇంటిలో ఉన్న చెత్తను, పనికిరాని వస్తువులను మేత వేసి భోగిమంటలు వేస్తారు.భోగి మంటల కోసం దైవ నామస్మరణ చేస్తూ, భోగిమంటల్లో ఆవుపేడ పిడకలను, నెయ్యిని, కర్పూరం లతో అగ్ని రగిలిస్తారు.

 Manchu Vishnu Family Bhogi Celebrations Pic Viral-మంటల్లో చీపురు, చాట వెయ్యండి.. అదేంటని ప్రశ్నించిన మనవరాలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అనంతరం అగ్ని దేవుడిని ప్రార్థిస్తారు.అలా ఆ భోగి మంటల్లో ఇంట్లోని చెత్తను పారేసి కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త ఏడాది, తొలి పండుగకు కొత్తదనాన్ని కోరుకుంటారు.

ఇలా భోగి పండుగ ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆరుబయట ఉదయాన్నే లేచి భోగి మంటలు వేస్తారు.ఇక భోగి పండుగ సందర్భంగా టాలీవుడ్ మంచు ఫ్యామిలీ కూడా భోగి పండుగను జరుపుకుంది.

ఫ్యామిలీ కూడా భోగి పండుగ సందర్భంగా వేకువ జామునే నిద్రలేచి భోగి మంటలు వేశారు.ఈ క్రమంలోనే మోహన్ బాబు తన మనవరాళ్లకు ఇంట్లో చీపురు, చాటలు, పాత వస్తువులు మంటల్లో వెయ్యండి అని చెప్పగా.

వాట్స్ దట్ చాట్ అనగా చాట అంటే ఏమిటి? అని ప్రశ్నించింది.

ఆ మాట విని బిత్తరపోయిన మోహన్ బాబు, నీకు చాట అంటే తెలీదా అంటూనే దాని గురించి వివరంగా చెప్పేందుకు ప్రయత్నించారు.అందుకు సంబంధించిన వీడియో నీ మంచు విష్ణు తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పంచుకున్నారు.ఈ వీడియోని చూసి నెటిజన్లు చాట అంటే తెలియక పోవడం ఏంటో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కొందరు కామెడీగా కామెంట్లు చేయగా, కొందరు నెగిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

#Grand #Manchu Lakshmi #Mohan Babu #Bhogi #Manchu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube