అలాయ్‌ బలాయ్ లో పవన్‌ తీరుపై తిరుపతిలో విష్ణు రియాక్షన్‌

నిన్న జరిగిన అలాయ్ బలాయ్ కార్యక్రమంలో మంచు విష్ణు మరియు పవన్ కళ్యాణ్ లు ఎదురు పడ్డారు.మా ఎన్నికల నేపథ్యంలో మెగా కాంపౌండ్ వారు మంచు వారిపై చాలా సీరియస్ గా ఉంది.

 Manchu Vishnu Comments On Pawan Not Talked News-TeluguStop.com

మోహన్‌ బాబు మరియు విష్ణులు కొన్ని సందర్బాల్లో నోరు జారారు.ఈ నేపథ్యంలో మంచు విష్ణు తో పవన్‌ కళ్యాణ్ అంటీ ముట్టనట్లుగా ఉన్నాడని.

అసలు పలకరించినా కూడా పట్టించుకోలేదు అన్నట్లుగా వార్తలు వచ్చాయి.పలు మీడియాలు మరియు టీవీ న్యూస్ ఛానెల్స్ కూడా అదే విషయాన్ని చూపించే ప్రయత్నం చేశాయి.

 Manchu Vishnu Comments On Pawan Not Talked News-అలాయ్‌ బలాయ్ లో పవన్‌ తీరుపై తిరుపతిలో విష్ణు రియాక్షన్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒక ఫొటోలో ఎడ మొహం పెడమొహం అన్నట్లుగా ఉన్నారు.ఆ ఫొటో తెగ వైరల్‌ అయ్యింది.

మీడియాలో జరిగిన ప్రచారం పై మంచు విష్ణు స్పందించాడు.

నేడు తెల్లవారు జామున తన ప్యానల్ తరపున పోటీ చేసి గెలిచిన ఓడిపోయిన వారందరు కూడా తిరుపతిలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు.

శ్రీవారి దర్శనం అనంతరం మోహన్ బాబు మంచు లక్ష్మి తో కలిసి విష్ణు బయటకు వచ్చాడు.ఆ సమయంలో మాట్లాడుతూ అలాయ్ బలాయ్ లో పవన్‌ తో నేను చాలా సమయం మాట్లాడాను.

చాలా విషయాలు ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం.ఏదో ఒక్క ఫొటోను పట్టుకుని విమర్శలు చేయడం ఏంటీ అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Telugu Alay Balay, Maa President Manchu Vishnu, Manchu Comments About Pawan, Manchu Vishnu, Manchu Vishnu Tirupati, Pawan Kalyan, Tollywood-Movie

పవన్ కళ్యాణ్ మరియు నేను మాట్లాడిన మాటల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు.కాని మేము ఇద్దరం మాత్రం చాలా సమయం మాట్లాడుకున్నట్లుగా మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.అక్కడ ప్రత్యక్ష సాక్ష్యం లేదు కనుక జనాలు నమ్మడం కష్టం అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పవన్‌ కళ్యాణ్‌ అవతలి వాడు ఎంతటి శత్రువు అయినా కూడా ఎదురుగా వస్తే నవ్వుతూ పలకరిస్తాడు.

కనుక విష్ణు తో కూడా మాట్లాడి ఉంటాడు అంటున్నారు.అసలు విషయం ఆ బండారు దత్తాత్రేయకే తెలియాలి.

#Alay Balay #Manchu Pawan #ManchuVishnu #Manchu Vishnu #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube