మంచు విష్ణు తగ్గేదేలే.. భక్త కన్నప్ప మూవీ కోసం ఏకంగా అంత రిస్క్ చేస్తున్నాడా? 

సినీ ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో నటుడు మంచు విష్ణు ( Manchu Vishnu ) ఒకరు.

మంచు విష్ణు ఈ మధ్యకాలంలో నటిస్తున్న సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరుస్తున్నాయి.

దీంతో ఈయనకు చాలా కాలం నుంచి సరైన హిట్ సినిమా పడలేదని చెప్పాలి.విష్ణు చివరిగా జిన్నా( Jinnaa ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీకి దూరమైనటువంటి విష్ణు కన్నప్ప( Kannappa )అనే సినిమాను ప్రకటించారు.ఈ సినిమా పూజ కార్యక్రమాలు శ్రీకాళహస్తిలో ఎంతో ఘనంగా జరిగాయి.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ కూడా జరుగుతున్నాయి.అలాగే ఈ సినిమా షూటింగ్ కోసం అవసరమయ్యే సామాగ్రి అంతా కూడా ఇప్పటికే ఏర్పాటు అయినట్టు తెలుస్తుంది.ఇక ఈ సినిమా మొత్తం న్యూజిలాండ్ లో సింగిల్ షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తి చేయాలని మేకర్స్ భావించారట.

Advertisement

ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగుకు సెట్ వేయడానికి అవసరమయ్యే వస్తువులన్నింటినీ దాదాపు 8 కంటైనర్లలో న్యూజిలాండ్ తరలించారని తెలుస్తుంది.

ఇలా సామాగ్రిని అన్నింటినీ కంటైనర్ లోకి తరలిస్తున్నటువంటి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి.సముద్రమార్గం గుండా న్యూజిలాండ్ తరలించబోతున్నారని తెలుస్తుంది.అయితే వీటన్నింటిని చూస్తుంటే ఈసారి మాత్రం మంచు విష్ణు సక్సెస్ అందుకోవాలనే కసితోనే ఈ భారీ బడ్జెట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాకి మహాభారతం టెలివిజన్ సిరీస్ దర్శకులలో ఒకరైన ముకేశ్ కుమార్ సింగ్ ( Mukesh Kumar Singh ) దర్శకత్వం వహిస్తున్నారు.త్వరలోనే చిత్ర బృందం కూడా న్యూజిలాండ్ వెళ్లనున్నారు.

ఇక ఈ సినిమా ద్వారా విష్ణు ఎలాంటి సక్సెస్ అందుకుంటారో వేచి చూడాలి.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు