మీరు మరీ అంచనాలు పెంచేసుకోకండి.. దీనికి దానికి సంబంధం లేదు

పలు సూపర్‌ హిట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందించిన శ్రీను వైట్ల వరుస ప్లాప్‌ లతో కనీసం ఆఫర్లు దక్కించుకోవడం కూడా కష్టంగా మారిపోయింది.టాలీవుడ్ లో సీక్వెల్స్ వరుసగా వస్తున్న ఈ సమయంలో ఈయన గతంలో చేసిన ఢీ సినిమా కు సీక్వెల్‌ ను ఢీ అండ్ ఢీ చేస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.

 Manchu Vishnu And Srinu Vaitla Movie D And D Not A Squeal Of Dhee-TeluguStop.com

ఢీ అండ్ ఢీ సినిమా ను మొదలు పెట్టారు.మొదట ఈ సినిమా ను సీక్వెల్‌ అన్నారు.

కాని ఇప్పుడు మాత్రం సీక్వెల్‌ కాదు అంటూ ఉన్నారు.ఇటీవల దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ మీడియాలో కొందరు ఢీ సినిమా కు సీక్వెల్‌ గా ఢీ అండ్ ఢీ రూపొందుతున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు.

 Manchu Vishnu And Srinu Vaitla Movie D And D Not A Squeal Of Dhee-మీరు మరీ అంచనాలు పెంచేసుకోకండి.. దీనికి దానికి సంబంధం లేదు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని అది ఏమాత్రం నిజం కాదు.ఢీ సినిమా కు ఢీ అండ్ ఢీ సినిమా కు అస్సలు సంబంధం లేదు.

మీడియాలో వస్తున్న పుకార్ల తో సినిమా గురించి ఒక అంచనాకు రావద్దంటూ ఆయన విజ్ఞప్తి చేశాడు.
దర్శకుడు శ్రీను వైట్ల మొదటి నుండి కూడా ఈ సినిమా కు ఆ సినిమా కు సంబంధం లేదు అన్నట్లుగా చెబుతున్నాడు.

ఎందుకంటే ఢీ సీక్వెల్‌ అంటే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి.అలాగే ఆ సినిమా లో ఉన్న పాత్రలు ఈ సినిమా లో ఆశిస్తారు.కాని అప్పటి నటీ నటులు లేరు అలాగే అప్పటి కామెడీ ఇప్పుడు సాధ్యం కాదు.అందుకే ఢీ అండ్ ఢీ సినిమా కు ఢీ సినిమా కు సంబంధం లేదంటే లేదు అంటూ అంచనాలు మొదట్లోనే తుంచే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ఈ సినిమా ను చూస్తున్న సమయంలో మాత్రం గతంలో వచ్చిన చూసిన ఢీ సినిమా ను చూసినట్లుగా అనిపించడం. కొన్ని సన్నివేశాలు టచ్‌ అవుతున్నట్లుగా అనిపించడం జరుగుతుందట.

సన్నివేశాలకు సీక్వెల్‌ కాని సినిమా కు సీక్వెల్‌ కాదా డైరెక్టర్ గారు అంటూ నెటిజన్స్ శ్రీను వైట్లను ప్రశ్నిస్తున్నారు.

#SrinuVaitla #Faria Abdullah #Manchu Vishnu #ManchuVishnu #SrinuVaitla

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు