ఆ సీనియర్ హీరో తన కొడుకుని ఐపీఎస్ ఆఫీసర్ ని చేద్దామనుకున్నాడు...  కానీ

టాలీవుడ్ లో సూర్యం, ఢీ, అస్త్రం, విష్ణు, దూసుకెళ్తా, ఓటర్ తదితర చిత్రాల్లో హీరోగా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించినటువంటి టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు పెద్ద తనయుడు మంచు విష్ణు గురించి తెలియని వారుండరు.అయితే ఇటీవల కాలంలో మంచు విష్ణు నటించినటువంటి కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలుస్తుండడంతో కొంతమేర మంచి విష్ణు తన సినిమాల జోరుని తగ్గించాడు.

 Manchu Mohan Babu, Manchu Vishnu, Ips Officer, Dhee, Tollywood-TeluguStop.com

 తాజాగా మంచు విష్ణుకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది.

గతంలో మంచు మోహన్ బాబు ఓ ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ చానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

ఇందులో భాగంగా తన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.ఇందులో మోహన్ బాబు తన పెద్ద కొడుకు విష్ణుని నిజాయితీగల ఐపీఎస్ ఆఫీసర్ ని చేయాలని అనుకున్నాననని కానీ అనుకోకుండా విష్ణు సినిమాల్లోకి వచ్చాడని చెప్పుకొచ్చారు.

అయితే విష్ణు సినిమాల్లోకి రావడమే గాక బాగానే రాణించాడని, ఇప్పటికీ బాగానే రాణిస్తున్నాడని తెలిపారు.  అంతేగాక మంచు విష్ణు విషయంలో తాను అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటని అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మంచు విష్ణు ప్రముఖ దర్శకుడు జెఫ్రీ ఘీ చిన్ దర్శకత్వం వహిస్తున్న“మోసగాళ్ళు” అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో మంచు విష్ణు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది.

అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ శెట్టి, నవదీప్, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి చిత్రీకరణ పనులు పూర్తి కాగా విడుదలకు సిద్ధంగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube