మంచు లక్ష్మీ వాట్సాప్ హ్యాక్.. నెటిజన్లు ఏమన్నారంటే..?

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అవుతున్నట్టు తరచూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.మూడు రోజుల క్రితం ప్రముఖ యాంకర్ లాస్య తన యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయినట్టు ప్రకటించారు.

 Manchu Mohan Babu Daughter Manchu Laxmi Youtube Channel Hacked,tollywood,whatts-TeluguStop.com

అయితే టెక్నికల్ టీం కృషి వల్ల లాస్య యూట్యూబ్ ఛానల్ రికవరీ అయింది.అయితే మంచు మోహన్ బాబు కూతురు, నటి మంచు లక్ష్మి వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయింది.

మంచు లక్ష్మీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వాట్సాప్ హ్యాక్ అయినట్టు వెల్లడించారు.నిన్న వాట్సాప్ హ్యాక్ కాగా ఇప్పటికే మంచు లక్ష్మీ వాట్సాప్ అకౌంట్ ను ఓపెన్ చేయలేకపోతున్నారని సమాచారం.

మంచు లక్ష్మీ తన పోస్ట్ లో వాట్సాప్ ను నిన్నటి నుంచి యాక్సెస్ చేయలేకపోతున్నానని మళ్లీ కొత్తగా ప్రారంభిస్తానని పేర్కొన్నారు.పండగ సమయంలో మంచు లక్ష్మీ వాట్సాప్ హ్యాక్ కాగా నెటిజన్లు వాట్సాప్ నుంచి సిగ్నల్ యాప్ కు మారాలని మంచు లక్ష్మికి సూచిస్తున్నారు.

వాట్సాప్ కొత్తప్రైవసీ పాలసీని తీసుకొనిరావడంతో పాటు ప్రైవసీ పాలసీని అంగీకరించపోతే వచ్చే నెల 8వ తేదీ తరువాత ఆ ఖాతాలు డిలేట్ అవుతాయని వాట్సాప్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.కొత్త ప్రైవసీ పాలసీ నేపథ్యంలో చాలామంది వాట్సాప్ యూజర్లు సిగ్నల్ యాప్ కు మారుతున్నారు.ఇలాంటి తరుణంలో సెలబ్రిటీలు తమ వాట్సాప్ హ్యాక్ అయిందని చేస్తున్న ప్రకటనలు యూజర్లను భయాందోళనలోకి నెట్టేస్తున్నాయి.

మరోవైపు ప్రస్తుతం మంచు లక్ష్మీ తిరుపతిలో ఉన్నారు.

మంచు లక్ష్మీ, మోహన్ బాబు ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మంచు లక్ష్మీ, మోహన్ బాబు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

టీటీడీ అధికారులు భక్తులందరికీ ఒకే విధంగా దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేశారని భోగి మంటల్లో కరోనా భస్మం అయిందని మోహన్ బాబు తెలిపారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube