వారిని ఇడియట్స్‌ అంటూ ఆవేశంతో తిట్టిన మంచు మనోజ్‌  

Manchu Manoj Twitter Crackers Corona April5th - Telugu April 5th, Corona Time, Crackers, Idiots, Manchu Manoj, Twitter

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లోని లైట్లు అన్ని కూడా ఆర్పేసి దీపాలను వెలిగించిన విషయం తెల్సిందే.ప్రధాని పిలుపుకు స్పందించిన స్టార్స్‌ పలువురు దీపాలు వెలిగించిన వారిలో ఉన్నారు.

 Manchu Manoj Twitter Crackers Corona April5th

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో దీపాలు వెలిగించడంతో పాటు పెద్ద ఎత్తున క్రాకర్క్‌ కూడా కాల్చారు.ఈ విషయమై మంచు మనోజ్‌ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇడియట్స్‌ మీకు ఈ సమయంలో క్రాకర్స్‌ కాల్చమని ఎవరు చెప్పారు.ఇలాంటి విపత్తు సమయంలో సరదాగా ఉండటం ఏమాత్రం సరికాదు అంటూ ఆగ్రహంను వ్యక్తం చేశాడు.మరికొందరు కాలుష్యం తక్కువ అవుతుందని బ్యాలన్స్‌ చేసేందుకు ఇలా క్రాకర్స్‌ కాల్చుతున్నారా అంటూ మండి పడ్డారు.మొత్తానికి నిన్న రాత్రి కొందరు చేసిన పనిపై అంతా కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.

వారిని ఇడియట్స్‌ అంటూ ఆవేశంతో తిట్టిన మంచు మనోజ్‌-Latest News-Telugu Tollywood Photo Image

వారిని ప్రతి ఒక్కరు కూడా తప్పుబడుతున్నారు.జాతి ఐక్యతను చాటేందుకు చేపట్టిన కార్యక్రమంను కావాలని తప్పుదోవ పట్టించేలా కొందరు అలా ప్రవర్తించారు.

మంచు మనోజ్‌ వారిపై నిర్మొహమాటంగా తీవ్ర స్వరంతో ఆవేశంతో ఇడియట్‌ అంటూ తిట్టాడు.మంచు మనోజ్‌ ట్వీట్‌కు చాలా మంది స్పందించారు.మీరు తిట్టడంలో అర్థం ఉంది.అలాంటి వారు ఇడియట్స్‌ కాకుండా మరేం అవుతారు అంటూ కామెంట్స్‌ చేశారు.ప్రస్తుతం మంచు మనోజ్‌ అహంబ్రహ్మాస్మి చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమా షూటింగ్‌ ఇటీవలే ప్రారంభం కాగా రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ లాక్‌ డౌన్‌ అయిన తర్వాత ప్రారంభం కాబోతుందట.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు