బ్రాహ్మణి పై మనోజ్ ట్వీట్..! కొందరు ప్రశంసిస్తుంటే కొందరు విమర్శిస్తున్నారు.! మీ కామెంట్ ఏంటి.?   Manchu Manoj Tweet On Brhmanai     2018-10-25   10:09:51  IST  Sainath G

నందమూరి బాలకృష్ణ కుమార్తె, మంత్రి నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణిపై హీరో మంచు మనోజ్ ప్రశంసల వర్షం కురిపించారు. సింహం కడుపున సింహమే పుడుతుందని కొనియాడారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..

నారా బ్రాహ్మణి ఆడ సింహం అని ప్రశంసించారు సినీ నటుడు మంచు మనోజ్. సింహం లాంటి బాలయ్య బాబుకు… సింహంలాంటి బిడ్డే పుట్టిందని …. ఆమె ఆడ సింహం అని… జై బాలయ్య అని కామెంట్ చేశారు. శ్రీకాకుళం జిల్లాకు అండగా నిలవాలని ఆమె తీసుకున్న నిర్ణయం తనకు స్ఫూర్తినిస్తోందని చెప్పారు. తాను చూసిన శక్తిమంతమైన మహిళల్లో నారా బ్రాహ్మణి ఒకరని మనోజ్ అన్నారు.

Manchu Manoj Tweet On Brhmanai-

హెరిటేజ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు నారాబ్రాహ్మణి. సంస్థ తరఫున తిత్లీ బాధిత శ్రీకాకుళం జిల్లాల్లో తుఫాను సాయం అందిస్తున్నారు. దీనికి సంబందించిన విశేషాలను సోషల్ మీడియాలో వివరిస్తున్నారు. హెరిటేజ్ గ్రూప్ సంస్థల తరఫున ఆమె ఇప్పటికే రూ.66లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని సీఎం వెల్ఫేర్ ఫండ్ కు అందించారు.

తాజాగా అరవింద సమేత వీర రాఘవ చిత్రానికి ఆమె స్పందించటం.. తన తమ్ముడికి ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపటం ఆసక్తికర వార్తగా మారింది. ఇప్పుడు బ్రాహ్మని ఏకంగా పది గ్రామాలను హోల్ సేల్ గా దత్తత తీసుకోవటం హాట్ టాపిక్ గా మారింది.

Manchu Manoj Tweet On Brhmanai-

మనోజ్ ట్వీట్‌కు మిశ్రమ స్పందన వస్తోంది. కొంత మంది బ్రాహ్మణి చొరవను కొనియాడుతుంటే.. మరికొద్దరు మనోజ్ పేర్కొన్న ‘సింహాలు’ అనే మాటను ట్రోల్ చేస్తున్నారు. పవన్ అభిమానులు కొందరు ఇది ఫేక్ న్యూస్ అని కొట్టిపారేస్తున్నారు. శ్రీకాకుళంలో గ్రామాలను దత్తత తీసుకున్నారంటే ఎవరూ నమ్మరు అంటూ కామెంట్లు పెడుతున్నారు.