శ్రీవారి ఆస్తుల అమ్మకంపై మంచు మనోజ్ ఆసక్తికర వాఖ్యలు  

Manchu Manoj Ttd Tweet Tirumala - Telugu Ap Politics, Manchu Manoj Viral Tweet On Ttd, Save Ttd, Tirupati, Ysrcp

ప్రస్తుతం టీటీడీ ఆస్తుల విక్రయం వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది.జాతీయ స్థాయిలో హిందుత్వ వాదులు, ఇతర పార్టీల వారు, స్వామీజీలు పెద్ద ఎత్తున వైసీపీ ప్రభుత్వ వ్యవహారంపై విమర్శలు చేస్తున్నారు.

 Manchu Manoj Ttd Tweet Tirumala

ఈ విషయంలో ఇప్పటికే ప్రజాగ్రహం ఎదురవుతుందని గమనించిన టీటీడీ భూముల అమ్మకంపై వెనక్కి తగ్గే ప్రయత్నం చేసింది.ఇదిలా ఉంటే శ్రీవారి ఆస్తుల విక్రయం అంశం పై సినీ నటుడు మంచు మనోజ్ స్పందించారు.

ఆస్తులు అమ్మమని దేవుడేమన్నా చెప్పాడా అంటూ టీటీడీని సూటిగా ప్రశ్నించారు.శ్రీవారికి సంబంధించిన ప్రతి విషయం చెప్పేది, చేసేది టీటీడీయేనని స్పష్టం చేశారు.

శ్రీవారి ఆస్తుల అమ్మకంపై మంచు మనోజ్ ఆసక్తికర వాఖ్యలు-General-Telugu-Telugu Tollywood Photo Image

సుప్రభాత సేవకు వేళయింది అని ఆ శ్రీహరిని, కొండకు వచ్చిన లక్షలమంది భక్తులను అందరినీ కంట్రోల్ చేసేది టీటీడీనే.అలాంటిది, వడ్డీకాసులవాడి ఆస్తులు అమ్మకానికి వచ్చాయంటే గోవింద నామస్మరణ చేసే నా గొంతు తడబడింది.అయితే, మోసం జరగట్లేదని తెలుసు.ఇన్ సైడర్ ట్రేడింగ్ లా కాకుండా అందరు చూస్తుండగా వేలం వేసి అమ్ముతారు.కానీ ఎందుకు అమ్మాల్సి వచ్చింది అనే అంశంపై పాలకమండలి వివరణ ఇస్తే బాగుంటుంది.వివరణ తప్ప మరేమీ కోరడంలేదు, ఎందుకంటే, ఇంత పెద్ద కొండ మాకు అండగా ఉందని చూస్తూ మురిసిపోయే తిరుపతి వాడ్ని కాబట్టి ఆపుకోలేక అడుగుతున్నాను అంటూ ట్వీట్ చేశారు.

ఇప్పుడు మనోజ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Manchu Manoj Ttd Tweet Tirumala Related Telugu News,Photos/Pics,Images..

footer-test