మనోజ్ సినిమా కథతో వైష్ణవ్ తేజ్..!

మంచు మనోజ్ హీరోగా శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరక్షన్ లో అహం బ్రహ్మస్మి సినిమా మొదలైన విషయం తెలిసిందే.మంచు మనోజ్ తన సొంత బ్యానర్ లో ఈ సినిమా నిర్మించాలని అనుకున్నారు.

 Manchu Manoj Story Shift To Vaishnav Tej , Manchu Manoj , Srikanth Reddy , Tollywood , Uppena , Vaishnav Tej-TeluguStop.com

సినిమా మొదలైన కొద్దిరోజులకే కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమాని ఆపేశారు.ఇప్పుడు ఆ దర్శకుడు మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో సినిమా చేస్తున్నాడు.

వైష్ణవ్ తేజ్ నాల్గవ సినిమాగా శ్రీకాంత్ రెడ్డి డైరక్షన్ లో సినిమా షురూ చేశారు.ఈ సినిమా ఓపెనింగ్ రోజే ఒక పోస్టర్ ని వదిలారు.

 Manchu Manoj Story Shift To Vaishnav Tej , Manchu Manoj , Srikanth Reddy , Tollywood , Uppena , Vaishnav Tej-మనోజ్ సినిమా కథతో వైష్ణవ్ తేజ్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ పోస్టర్ చూస్తే మనోజ్ తో ఆగిపోయిన అహం బ్రహ్మస్మి సినిమానే వైష్ణవ్ తేజ్ తో తీస్తున్నారని అనిపిస్తుంది.పోస్టర్ లో వైష్ణవ్ తేజ్ మాస్ అప్పీల్ మెగా ఫ్యాన్స్ ని మెప్పించింది.

ప్రస్తుతం రంగ రంగ వైభవంగా సినిమాతో రాబోతున్న వైష్ణవ్ తేజ్ సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకోవాలని చూస్తున్నాడు.మంచు మనోజ్ సినిమానే వైష్ణవ్ తేజ్ చేస్తున్నాడా లేక శ్రీకాంత్ రెడ్డి వైష్ణవ్ తేజ్ కోసం కొత్త కథ రాశాడా అన్నది తెలియాల్సి ఉంది.

మంచు మనోజ్ విషయానికి వస్తే కొన్నాళ్లుగా కెరియర్ గ్యాప్ తీసుకున్న మనోజ్ మళ్లీ ఒకప్పటి తన రూపం కోసం ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube