వియ్యంకులుగా మారిన టాలీవుడ్ హీరోలు!

టాలీవుడ్ యంగ్ హీరోలు ఇద్దరూ వియ్యంకులుగా మారారు.అదేంటి యంగ్ హీరో లు ఏంటి వియ్యంకులుగా మారడం ఏంటి అని ఆలోచిస్తున్నారా.

 Manchu Manoj Sai Dharam Tej Pet Dogs-TeluguStop.com

అదేనండి ఇక్కడే ఉంది ఒక పెద్ద ట్విస్ట్.అసలు కథ ఏంటంటే టాలీవుడ్ యువ హీరో మంచు మనోజ్ సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటాడు అని అందరికీ తెలిసిందే.

అందరితోనూ చాలా జోవియల్ గా ప్రవర్తించే మంచు మనోజ్ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికరమైన పోస్ట్ ఒకటి చేశాడు.సాయిధరమ్ తేజ్ ను తన వియ్యంకుడిగా పేర్కొంటూ కృతజ్ఞతలు తెలియజేశాడు.

 Manchu Manoj Sai Dharam Tej Pet Dogs-వియ్యంకులుగా మారిన టాలీవుడ్ హీరోలు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంతకీ సాయి ధరమ్ తేజ్ ఎలా వియ్యంకుడు అయ్యాడు అని ఆలోచిస్తున్నారా.తేజ్ పెంపుడు శునకం,అలానే మంచు మనోజ్ పెంపుడు శునకం రెండూ కూడా డేటింగ్ చేయబోతున్నాయట.

తేజ్ సహకారంతో మనోజ్ తన పెంపుడు శునకానికి డేటింగ్ ఏర్పాడు చేశాడట.ఈ విషయాన్నీ మనోజ్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.“టాంగో, జోయాలకు ఇది డేటింగ్ రోజు.భౌతికదూరం నియమం కచ్చితంగా పాటించాం.

నాకు మంచి అల్లుడ్ని ఇస్తున్నందుకు నా వియ్యంకుడు సాయిధరమ్ తేజ్ కు థ్యాంక్స్.

త్వరలోనే ముహుర్తాలు పెట్టించి శుభలేఖలు వేయిస్తాం” అంటూ చమత్కారంగా ట్వీట్ చేసాడు.

అంతేకాదు, తమ పెంపుడు కుక్కలతో ఉన్న వారిద్దరి ఫొటోను కూడా మంచు మనోజ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.మొత్తానికి మనుషుల డేటింగ్ లు పోయి ఇప్పుడు కుక్కల వంతు వచ్చినట్లు ఉంది.

ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా సినిమా షూటింగ్ లు ఏవి కూడా రెగ్యులర్ గా జరగకపోవడం తో యంగ్ హీరో లు అందరూ కూడా ఇలా ఇతర యాక్టివిటీస్ తో బిజీ బిజీ అయిపోతున్నారు.

#PetDogs #Sai Dharam Tej #ManchuManoj #Pet Dogs #Manchu Manoj

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు