కరోనాని మించిన ఘోరాలు చూస్తున్నాం అంటున్న మనోజ్

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సామాజిక సేవలలో ముందుంటారు.ఎలాంటి విషయం అయిన స్పందించే వారిలో ముందు వరుసలో ఉండే మనోజ్ కరోనా విపత్తు సమయంలో ప్రజలకి మనోధైర్యం కల్పించడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నారు.

 Manchu Manoj Open Letter On Corona Fear, Covid-19, Lock Down, Corona Effect Migr-TeluguStop.com

అందులో భాగంగా కరోనా సంక్షోభం నేపథ్యంలో ఓ లేఖ రాశారు.ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇప్పుడందరూ కరోనాతో కలిసి జీవించక తప్పదని అంటున్నారని, దీంట్లో కంగారుపడాల్సిందేమీ లేదని, కరోనాను మించిన వాటితోనే కలిసి జీవించాం.గోకుల్ చాట్ వద్ద బాంబు పెట్టినవాడు కూడా మనందరితో కలిసి తిరిగినవాడేనని, అంతటి క్రూరుడితోనే కలిసి తిరిగాం, ఈ కరోనా ఎంత చెప్పండి అని వాఖ్యానించారు.

పెళ్లి బట్టలు కొనాలని వెళ్లి కారు పార్క్ చేస్తే పైనున్న ఫ్లైఓవర్ కుప్పకూలి మీదపడి చనిపోయారని, నీచమైన కాంట్రాక్టర్లు వేసిన బ్రిడ్జిలపైన సంతోషంగా తిరిగేస్తున్నామని, ఇంతకంటే కరోనా ఏమైనా ప్రమాదకరమా అని పేర్కొన్నారు.కోఠి ఉమెన్స్ కాలేజీకి వెళ్లే అమ్మాయిలు ఎంతోమంది కామ పిశాచుల కళ్లను దాటుకుంటూ వెళుతుంటారని, అలాంటి వాళ్లకు ఈ కరోనాను దాటి వెళ్లడం ఓ లెక్కా అంటూ వ్యాఖ్యానించారు.

ఇలాంటివే మరికొన్ని అంశాలను కూడా మనోజ్ తన లేఖలో ప్రస్తావించారు.అలాగే కరోనా కారణంగా కాశ్మీర్ నుంచి కన్య కుమారి వరకు కాళ్ళు అరిగేలా నడుచుకొని పొట్ట చేతపట్టుకొని, చేయి చాచి అడగలేక సొంత ఊరు తరలిపోతున్న వలస కార్మికులు మనకి రోజు ఎక్కడో ఒక చోట కనిపించిన వాడే.

వాళ్ళని గమ్యం చేర్చే బాధ్యత మనదే అంటూ లేఖలో పేర్కొన్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube