ఆ పని చేసిన మొట్టమొదటి హీరో మనోజ్ మాత్రమే

వెండితెర మీదే కాదు నిజజీవితంలోనూ తమకు సామజిక బాధ్యత ఉందని నిరూపించుకుంటారు కొంతమంది సినీ ప్రముఖులు అటువంటి వారిలో ఎప్పుడూ ముందుండేందుకు ప్రయత్నిస్తుంటాడు మంచువారి అబ్బాయి మనోజ్.సోషల్ అవేర్నెస్ కార్యక్రమం ఏదైనా అందులో నేను ఉన్నాను అంటూ తప్పకుండా హాజరు వేయించుకుంటాడు మనోజ్.

 Manchu Manoj Meets Dishas Family-TeluguStop.com

ఇక సోషల్ మీడియా ద్వారా అయితే అభిమానులకు ఎప్పుడూ టచ్ లో ఉంటూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ వారికీ అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు.

తెలంగాణాలో మూడు రోజుల క్రితం జరిగిన దిశ హత్యాచార ఘటన దేశమంతటా ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే.

దీనిపై దేశవ్యాప్తంగా సెలబ్రెటీలంతా తమ స్పందనను తెలియజేస్తూ ఉన్నారు.అయితే వారంతా మీడియా ముఖంగానూ, సోషల్ మీడియా ద్వారా తమ స్పందన తెలియజేస్తున్నారు.అలా కూడా స్పందించని సెలెబ్రెటీలను సోషల్ మీడియాలో అంతా తిట్టిపోస్తుండడంతో ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు.

అయితే ఇప్పటివరకు నేరుగా దిశ ఇంటికి వెళ్లి పరామర్శించిన హీరో మంచు మనోజ్ మాత్రమే.

ఈ రోజు దిశ ఇంటికి వెళ్లి, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా దిశ తల్లి పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కు పోతోందని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ప్రభుత్వం, మహిళల భద్రత కోసం మరింత అవగాహన కల్పించాలని, అటువంటి కార్యక్రమాల్లో తాను కూడా భాగస్వామ్యం అవుతానని మనోజ్ పేర్కొన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube