Manchu Manoj Manchu Vishnu : మనోజ్ కుటుంబానికి దూరం కానున్నాడా.. మంచు ఫ్యామిలీలో అసలేం జరుగుతోంది?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి ఫ్యామిలీకి ఉన్న ప్రత్యేకత గురించి మనందరికీ తెలిసిందే.అయితే గత కొద్ది రోజులుగా మంచు కుటుంబంలో విభేదాలు నెలకొన్నాయి అన్న వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

 Manchu Manoj Is Looking To Get Closer To The Manchu Family4 Again , Manchu Famil-TeluguStop.com

హీరో మంచు మనోజ్ భూమా మౌనికను ప్రేమించడంతో అదే విషయం పట్ల మంచు ఫ్యామిలీలో గొడవలు జరిగాయని దీంతో మంచు మనోజ్ కుటుంబానికి దూరమయ్యాడు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.మంచు విష్ణు కూడా తమ్ముడు మంచు మనోజ్ తో మాట్లాడటం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం మంచు మనోజ్ తల్లిదండ్రులతో కలిసి ఉండకుండా సపరేట్ గా ఉంటున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం మంచు మనోజ్ మళ్లీ తన కుటుంబంతో కలిసి సంబంధాలు కలుపుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇటీవలే మంచు విష్ణు తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే.ఆరోజు జంబలకడి జారు మిఠాయ సాంగ్ పాడించి మరీ మనోజ్, మంచు విష్ణు కీ బర్త్డే విషెస్ తెలిపాడు.

కానీ మంచు విష్ణు మాత్రం స్పందించలేదు.తనకు బర్త్డే విషెస్ చెప్పిన వారందరికీ థాంక్స్ చెప్పినట్టుగా కూడా తన తమ్మునికి థాంక్స్ చెప్పలేదు మంచి విష్ణు.

Telugu Ariana, Bhuma Mounika, Manchu, Manchu Manoj, Manchu Vishnu, Tollywood, Vi

ఇకపోతే నేడు మంచు విష్ణు కుమార్తెలు అయినా అరియానా,విరియానా బర్త్ డే కావడంతో వాళ్ళిద్దరికీ బర్త్డే విషెస్ తెలిపాడు.మంచు మనోజ్.దానికి కూడా మంచు ఫ్యామిలీ నుంచి ఎటువంటి స్పందన లేదు.అయితే మంచు మనోజ్ తన ఫ్యామిలీకి దగ్గర అవ్వాలనుకుంటున్న కొద్ది మంచు కుటుంబం అతని దూరం పెడుతూనే ఉంది అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

ఈ వార్తలపై పలువురు నెటిజన్స్ స్పందిస్తూ అన్నదమ్ములు సోషల్ మీడియాలో మాట్లాడుకోవాలని రూల్ ఏమైనా ఉందా బయట మాట్లాడుకుంటున్నారేమో అంటూ కామెంట్స్ లో తెలియజేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube