మంచు మనోజ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా ..?   Manchu Manoj Is Coming To Politics     2018-10-21   22:37:39  IST  Sai M

మంచు మనోజ్‌ సరికొత్త నిర్ణయం తీసుకున్నాడు. ప్రజలకు తనవంతు సేవ చేస్తానని..ఈ జీవితం ఇక ప్రజా సేవకే అంకితమంటూ ఓ లెటర్ రిలీజ్ చేశాడు. దీంతో పరోక్షంగా ఆయన రాజకీయాలకు ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ట్విట్టర్ ద్వారా ఓ లెటర్ రిలీజ్ చేసిన మనోజ్.. సినిమాలే ప్రపంచం కాదంటూ.. తనకు చేతనైన సహాయం చేయడానికి బయలు దేరినట్టు ఈ హీరో సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించాడు.

తనకు ఎంతో ఇష్టమైన ప్రదేశం తిరుపతి అని, అక్కడి అణువణువు దైవత్వంతో నిండి ఉందంటూ.. తను ప్రారంభించబోయే సహాయ కార్యక్రమాలు రాయలసీమ నుంచే మొదలుపెడతానని..రాగి సంగటి, మటన్ పులుసు రెడీగా పెట్టుకోండి అంటూ .. ఓ పెద్ద లెటర్ ను ట్వీట్‌ చేశాడు. మంచు మనోజ్‌ షేర్‌ చేసిన లెటర్ ఇలా ఉంది.