బన్నీ సినిమాలో మంచు హీరో.. ఎవరంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మంచు మనోజ్ కలిసి ఇదివరకే వేదం సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా మంచి విజయవంతం కావడంతో , వీళ్ళిద్దరూ హిట్ కాంబినేషన్ గా పేరు సంపాదించుకున్నారు.

 Manchu Manoj In The Bunny Pushpa Movie-TeluguStop.com

అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోందా? అంటే అవుననే చెప్పాలి.తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “పుష్ప” సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమాలో హీరో మంచు మనోజ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని సమాచారం వినబడుతుంది.

 Manchu Manoj In The Bunny Pushpa Movie-బన్నీ సినిమాలో మంచు హీరో.. ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సుకుమార్ దర్శకత్వంలో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది.

అయితే ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి చేయాల్సిన ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో మంచు మనోజ్ నటిస్తున్నట్లు సమాచారం.అయితే వీరిద్దరి కాంబినేషన్లో ఇది రెండవ సినిమా అని చెప్పవచ్చు.

ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారు.ఈ సినిమాలో రష్మిక ఓ గిరిజన యువతి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

Telugu Alluarjun, Manchu Manoj, Police Officer Role, Pushpa, Pushpa Movie Update, Rashmika Mandana, Romantic Song, Tollywood, Urvashi Rautela, Vijay Setupathi-Movie

ఇక తాజా షెడ్యూల్ లో భాగంగా రష్మిక, బన్నీ పై ఒక రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేయాల్సి ఉంది.అదే విధంగా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా సందడి చేయనున్నారు.ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నారు.అయితే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇదివరకే చిత్ర బృందం అధికారిక విడుదల తేదీని ప్రకటించిన విషయం తెలిసిందే

#Pushpa #Romantic #Vijay Setupathi #Urvashi Rautela #Manchu Manoj

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు