భార్యతో విడాకుల విషయం పై ట్విస్ట్ ఇచ్చిన మంచు మనోజ్ ..! ఏమని ట్వీట్ చేసాడంటే.?  

మంచు ఫామిలీ కి చెందిన జంట విడాకులు తీసుకోనుందని వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.మనోజ్ కి గత కొన్నాళ్లుగా సరైన హిట్ లేకపోవడం, ప్రస్తుతం చేతిలో ప్రొజెక్ట్స్ లేకపోవడంతో ఇంట్లోనే ఉంటున్నాడు.ప్రణతికి ఇది నచ్చడం లేదు..

Manchu Manoj Divorce Gets Aclarity--

సంపాదన లేక, ఇటు క్రేజీ కూడా లేకపోవడంతో రెగ్యులర్ గా తగువులు పెట్టుకొనేదట.కలిసి ఉండడం ఇష్టం లేకనే ప్రస్తుతం చదువు పేరు చెప్పి అమెరికా లో ఉంటుందట ప్రణతి రెడ్డి.

Valla Bondha 😂 https://t.co/z6oOfDfTXw— Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) June 8, 2018.

ఈ విషయంపై మంచు మనోజ్ స్పందించారు.నిన్న మనోజ్ తన అభిమానులతో ట్విట్టర్ చాట్లో పాల్గొన్నప్పుడు ఒక అభిమాని మనోజ్‌ ను ఈవిషయమై ప్రశ్నించగా మంచువారి అబ్బాయి క్లారిటీ ఇచ్చాడు.‘వాళ్ల బొంద ప్రణతి నా దేవత’ అంటూ సమాధానం ఇచ్చాడు.మనోజ్ సమాధానంతో ఈ విషయంలో అభిమానుల్లో మీడియాలో నెలకొన్న డౌట్ క్లియర్ అయినట్లయింది.

2010 nunchi thanu na jeevitham lo adugu pettindhi … Na gunde aggipoye antha varaku thane na Devatha 🙂 🙏🏻❤️ https://t.co/BQIE6IsjB5— Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) June 8, 2018

ఇదే సందర్భంలో మనోజ్ తన అన్నయ్య మంచు విష్ణు దర్శకత్వంలో నటించబోతున్నట్లు వచ్చిన వార్తల పై కూడ క్లారిటీ ఇస్తూ అలాంటి విషయాలు ఏమి లేవనీ స్పష్టం చేసాడు.అయితే తన తర్వాత చిత్రం ఒక ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని ఆగస్టులో ఇందుకు సంబంధించిన షూటింగ్ మొదలవుతుందని క్లారిటీ ఇచ్చాడు.తన తండ్రి మోహన్ బాబు సినిమాలలో తాను రీమేక్ చేయవలసి వస్తే తనకు ‘అల్లుడుగారు’ సినిమా రీ మెక్ లో నటించాలని కోరిక ఉంది అంటూ అభిప్రాయపడ్డాడు.

ఈమధ్య కాలంలో మనోజ్ విపరీతమైన బరువు పెరిగి పోవడంతో అతడికి ఏమాత్రం అవకాశాలు రావడం లేదు.దీనితో మనోజ్ ప్రస్తుతం తన బరువును తగ్గించుకునే ట్రీట్మెంట్ అమెరికాలో చేయించుకోవాలి అన్న ఆలోచనలలో ఉన్నట్లు టాక్.