మంచు మనోజ్ కు ప్రణతి విడాకులు?       2018-06-05   03:49:16  IST  Raghu V

క్రిష్ త‌న భార్య ర‌మ్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్టు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది, అంతేకాకుండా విడాకుల కోసం ఫ్యామిలీ కోర్ట్ ను కూడా ఆశ్ర‌యించిన‌ట్టు తెలుస్తుంది.!? ఈ గొడవ ఇంకా సర్ధుమణగక ముందే మరో విడాకుల కేసు తయారయ్యింది టాలీవుడ్ లో. ఎవరో కాదండోయ్…మంచు ఫామిలీ కి చెందిన జంట విడాకులు తీసుకోనుందని వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మనోజ్ కి గత కొన్నాళ్లుగా సరైన హిట్ లేకపోవడం, ప్రస్తుతం చేతిలో ప్రొజెక్ట్స్ లేకపోవడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. ప్రణతికి ఇది నచ్చడం లేదు,కలిసి ఉండడం ఇష్టం లేకనే ప్రస్తుతం చదువు పేరు చెప్పి అమెరికా లో ఉంటుందట ప్రణతి రెడ్డి.

-

విడాకులు ఫైనల్ అయినట్లేనని, మధ్యలో మోహన్ బాబు ఎంత ప్రయత్నించినా సరైన ఫలితం లేదని తెలుస్తోంది. అసలే వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న మంచు ఫ్యామిలీకి ఈ వివాదం మరో పెద్ద దెబ్బ.

ఇది ఎంత నిజమో తెలియదు కానీ ఈ పుకార్లకి ఫుల్ స్టాప్ పెడుతూ మనోజ్ తన ట్విట్టర్ లో తన భార్య, స్నేహితులతో కలిసి దిగిన ఒక ఫోటోని పెట్టాడు. దీనితో ఇవి ఒట్టి పుకార్లు మాత్రమేనని క్లారిటీ వచ్చేసింది. అయితే ఇటువంటి పుకార్లు ఎందుకు వస్తున్నాయో మాత్రం తెలియట్లేదు.