బాబు.. నీ కొడుకు క్రమశిక్షణ సంగతి ఏంటీ?       2018-06-04   23:17:25  IST  Raghu V

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న వారిలో ఎక్కువగా క్రమశిక్షణగా ఎవరు ఉంటారు అంటే ఎక్కువ శాతం మంది మోహన్‌బాబు పేరు చెబుతారు. ఎందుకంటే ఆయన క్రమశిక్షణకు మారు పేరు అంటూ మొదటి నుండి పేరు పడిపోయినది. ఆయనతో వర్క్‌ చేయాలనుకుంటే క్రమశిక్షణగా ఉండాలి, లేదంటే దెబ్బు తినాల్సి వస్తుందని అంతా భావిస్తూ ఉంటారు. అలాంటి మోహన్‌బాబు తన పిల్లలను మాత్రం క్రమశిక్షణతో పెంచలేక పోయారు అంటూ గతంలో పలువురు పలు రకాలుగా విమర్శించారు. తాజాగా ఆయన కొడుకు చేసిన పని ప్రస్తుతం ఆయనపై మరో సారి విమర్శలు చేసే విధంగా చేసింది.

మోహన్‌బాబు చిన్న కొడుకు మంచు మనోజ్‌ తాజాగా ఒక పబ్‌లో హంగామా సృష్టించి గందరగోళం చేశాడు. కాస్త ఆస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం మంచు ఫ్యామిలీ పరువును గంగలో కలిపింది. పది రోజుల క్రితం మంచు మనోజ్‌ జూబ్లీహిల్స్‌లోని ఒక పబ్‌కు వెళ్లాడు. అక్కడ స్నేహితులతో బాగా తాగాడు. ఆ తర్వాత డాన్స్‌లు చేస్తూ ఎంజాయ్‌ చేశాడు. ఆ సమయంలోనే రాత్రి 11.30 గంటలు దాటడంతో డీజే సౌండ్స్‌ తగ్గించారు. పోలీసు వారు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా డీజే సౌండ్స్‌ను తగ్గించడంతో మంచు మనోజ్‌కు కోపం వచ్చింది. తాను పబ్‌లో ఉండగా సౌండ్స్‌ తగ్గించడంతో ఆయనకు తీవ్ర ఆగ్రహం కలిగింది.

సౌండ్స్‌ పెంచమని పబ్‌ మేనేజర్‌ను హెచ్చరించాడు. కాని ఆయన మాత్రం నో చెప్పాడు. దాంతో ఆగ్రహంతో స్పీకర్స్‌ను ద్వంసం చేయడంతో పాటు, అక్కడ ఉన్న ఫర్నీచర్‌ను కూడా మంచు మనోజ్‌ తాగిన మైఖంలో ద్వంసం చేయడం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు నిమిషాల వ్యవధిలో అక్కడకు చేరుకున్నారు. అప్పుడు మంచు మనోజ్‌ రివర్స్‌ అయ్యి తాను ఫోన్‌ మాట్లాడుతున్నాను, సౌండ్‌ తగ్గించమంటే తగ్గించలేదు, అందుకే ఇలా చేశాను అంటూ పోలీసులతో చెప్పుకొచ్చాడు. అతడు చెప్పింది అవాస్తవం అని, సీసీ పుటేజ్‌లో అంతా తొస్తుందని పబ్‌ యాజమాన్యం అన్నారు.

సీసీ పుటేజ్‌ చూసిన పోలీసులు మనోజ్‌ది తప్పని నిర్థారణకు వచ్చారు. పబ్‌ యాజమాన్యం ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని అన్నారు. కాని మనోజ్‌పై కేసు పెట్టేందుకు పబ్‌ యాజమాన్యం అంగీకరించలేదు. దాంతో పోలీసులు మనోజ్‌కు నచ్చజెప్పి, ఇద్దరి మద్య రాజీ కుదిర్చి అక్కడ నుండి వెళ్లి పోయారు. ఈ విషయం మోహన్‌బాబుకు కూడా కాస్త ఆలస్యంగా తెలిసింది. కొడుకును మందలించినట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా పలు సార్లు ఈ విధంగానే జరిగింది. మోహన్‌బాబు నీతి, క్రమశిక్షణ సుక్తులు ఇతరులకే తప్ప, తనకు, ఆయన కుటుంబంకు పనికి రావా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మోహన్‌బాబు ఈ విషయమై స్పందించాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు.