మంచు మనోజ్‌ విడాకులు, కారణం ఏంటీ ఎన్నాళ్లు కలిసి ఉన్నారో తెలుసా?  

Manchu Manoj Confirms Divorce With Wife Pranathi Reddy-manchu Manoj Divorce,pranathi Reddy,telugu Actor Divorce

మంచు ఫ్యామిలీలో ఆశ్చర్యకర సంఘటన జరిగింది.ఆ ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉందని భావిస్తున్న సమయంలో టాలీవుడ్‌ మొత్తం అవాక్కయ్యేలా.తెలుగు వారు అంతా కూడా నోరు వెళ్లబెట్టేలా మంచు మనోజ్‌ తన భార్య ప్రణతికి విడాకులు ఇచ్చినట్లుగా ప్రకటించాడు.

Manchu Manoj Confirms Divorce With Wife Pranathi Reddy-manchu Manoj Divorce,pranathi Reddy,telugu Actor Divorce-Manchu Manoj Confirms Divorce With Wife Pranathi Reddy-Manchu Pranathi Reddy Telugu Actor

2015లో తాను ప్రేమించిన ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్న మంచు మనోజ్‌ ఇటీవల ఆమె నుండి విడిపోయినట్లుగా అధికారికంగా ప్రకటించాడు.ఆమెతో జీవితం సాధ్యం కాకపోవడం వల్లే విడిపోయినట్లుగా మనోజ్‌ పేర్కొన్నాడు.సుదీర్ఘమైన పోస్ట్‌ పెట్టిన మంచు మనోజ్‌ తన వైవాహిక జీవితంకు ఫుల్‌ స్టాప్‌ పడ్డట్లుగా ప్రకటించడంతో అంతా అవాక్కవుతున్నారు.

Manchu Manoj Confirms Divorce With Wife Pranathi Reddy-manchu Manoj Divorce,pranathi Reddy,telugu Actor Divorce-Manchu Manoj Confirms Divorce With Wife Pranathi Reddy-Manchu Pranathi Reddy Telugu Actor

2015 మే లో మంచు మనోజ్‌, ప్రణతిల వివాహం అయ్యింది.పెళ్లి అయిన సంవత్సరం వరకు ఇద్దరు కలిసే ఉన్నారు.ఆ తర్వాత నుండి ఇద్దరి మద్య విభేదాలు ప్రారంభం అయ్యాయని, సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరు 2017 నుండే విడి విడిగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది.వీరిద్దరు కలిసి ఉన్నది కేవలం సంవత్సం పాటే అంటూ కూడా సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇద్దరి దారులు వేరు, అభిప్రాయాలు వేరు అవ్వడం వల్ల విడాకుల వరకు వెళ్లారని తెలుస్తోంది.

 ఇరు కుటుంబాల సభ్యులు కూడా ఇద్దరిని కలిసి ఉంచేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశారట.కాని ఇద్దరు కూడా కలిసి ఉండటం అసాధ్యంగా భావించి విడిపోయారట.సంవత్సరం మాత్రమే కలిసి ఉన్న వీరిద్దరు విడిపోవడానికి అసలు కారణం ఏంటో తెలియదు కాని ఇండస్ట్రీలో రకరకాల కారణాలు అయితే వినిపిస్తున్నాయి.

ప్రణతి ఉన్నత విద్యావంతురాలు.ఆమె అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఆనందంగా ఉండాలనుకుంది.కాని మనోజ్‌ మాత్రం అమెరికాకు వెళ్లడం ఒప్పుకోలేదని అందుకే ఇద్దరి మద్య గొడవలు ప్రారంభం అయ్యాయని అంటున్నారు.ప్రస్తుతం ప్రణతి అమెరికాలో ప్రముఖ కంపెనీలో సీఏగా చేస్తుందని.కెరీర్‌ కోసం ప్రణతి భర్తతో విడాకులు తీసుకుందని అంటున్నారు.మొత్తానికి మంచు మనోజ్‌ జీవితంలో జరిగిన ఈ సంఘటన ఆయన అభిమానులను తీవ్రంగా కలచి వేస్తోంది.