జనసేనపై ఆశ్చర్యకర కామెంట్స్‌ చేసిన మంచు మనోజ్‌.. పవన్‌ తో కలుస్తాడా?  

ఈమద్య కాలంలో మంచు మనోజ్‌ వరుసగా పొలిటికల్‌ కామెంట్స్‌ చేస్తున్న విషయం తెల్సిందే. చంద్రబాబు నాయుడు ఏపీకి మంచి కంపెనీలను తీసుకు వస్తున్నాడంటూ ప్రశంసలు కురిపించిన విషయం తెల్సిందే. అంతకు ముందు జగన్‌తో కూడా మనోజ్‌ భేటీ అయ్యాడు. తాజాగా జనసేనానిపై మంచు మనోజ్‌ ప్రశంసలు కురిపించాడు. సినిమాల విషయాన్ని పక్కన పెట్టి వరుసగా రాజకీయ కామెంట్స్‌ చేస్తున్న మంచు మనోజ్‌ తాజాగా జనసేనపై పాజిటివ్‌గా స్పందించిన నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు ఆయన్ను జనసేనలోకి రావాల్సిందిగా కోరుతున్నారు.

Manchu Manoj Comments On Pawan Kalyan Janasena-Manchu Manchu About Janasena Manoj Coments

Manchu Manoj Comments On Pawan Kalyan Janasena

మంచు మనోజ్‌ తాజాగా సోషల్‌ మీడియాలో స్పందిస్తూ… జనసేన పార్టీలో అంతా కూడా ఉన్నత విధ్యావంతులు మరియు జ్ఞానం కలిగిన వారు ఉండటం అభినందనీయం అంటూ పోస్ట్‌ చేశాడు. అద్బుతమైన పనితీరుతో జనసేన ముందుకు వెళ్లాలని ఆయన కోరుకున్నాడు. ఈ సమయంలోనే పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు ఎంతో మంది కూడా జనసేన పార్టీలో చేరాలని కోరుకుంటున్నారు. అయితే మంచు మనోజ్‌ మాత్రం రాజకీయాలపై ఆసక్తి లేదంటూనే, ఏ పార్టీలో చేరేది లేదు అంటూనే గతంలో ఒక ప్రకటన చేశాడు.

Manchu Manoj Comments On Pawan Kalyan Janasena-Manchu Manchu About Janasena Manoj Coments

గతంలో పవన్‌ కళ్యాణ్‌ ఆగ్రహంతో మోహన్‌బాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. ఆ విమర్శలు సోషల్‌ మీడియాలో ఇంకా కూడా మారుమ్రోగుతూనే ఉన్నాయి. అలాంటి సమయంలో జనసేనలో మంచు మనోజ్‌ చేరితే ఏమైనా ఉందా, మోహన్‌బాబు ఊరుకుంటాడా అనేది కొందరిని వేదిస్తున్న ప్రశ్న. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో ఏదో ఒక పార్టీలో చేరి మంచు మనోజ్‌ చక్రం తిప్పేలా కనిపిస్తున్నాడు. అది ఏ పార్టీ అనే విషయంపై త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.