నవంబర్ 2న సెట్స్ పైకి వెళ్లనున్న మంచు మనోజ్ అహం బ్రహ్మస్మి  

Manchu Manoj Aham Brahmasmi Shooting Schedule Fixed, Tollywood, Telugu Cinema, Pan India Movie, Srikanth Reddy,Manchu Manoj, Aham Brahmasmi Shooting - Telugu @heromanoj1, Aham Brahmasmi, Aham Brahmasmi Shooting, Manchu Manoj, Manchu Manoj Aham Brahmasmi Shooting Schedule Fixed, Pan India Movie, Srikanth Reddy, Telugu Cinema, Tollywood

టాలీవుడ్ లో టాలెంటెడ్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకొని ఎక్కువగా ప్రయోగాత్మక కథలతో సినిమాలు చేసే హీరోగా మంచు ఫ్యామిలీ హీరో మనోజ్ కి మంచి గుర్తింపు ఉంది.అయితే ఎన్ని సినిమాలు చేసిన అతని కెరియర్ లో చెప్పుకోదగ్గ సాలిడ్ హిట్ అంటూ ఇప్పటి వరకు లేదు.

TeluguStop.com - Manchu Manoj Aham Brahmasmi Shooting Schedule Fixed

అప్పుడెప్పుడో బిందాస్ అంటూ సందడి చేశాడు.తరువాత అతని కెరియర్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేశాడు.

కొత్త దర్శకులని టాలీవుడ్ కి పరిచయం చేశాడు.అయితే వాటిలో ఏ ఒక్కటి కూడా ప్రేక్షకులని మెప్పించలేకపోయింది.

TeluguStop.com - నవంబర్ 2న సెట్స్ పైకి వెళ్లనున్న మంచు మనోజ్ అహం బ్రహ్మస్మి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

మంచు మనోజ్ చివరిగా రెండేళ్ల క్రితం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.తరువాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు.

ఈ గ్యాప్ రావడానికి వ్యక్తిగత జీవితంలో తన భార్యతో విడాకులు కూడా ఒక కారణంగా చెప్పుకోవాలి.

అయితే చాలా గ్యాప్ తర్వాత ఆ మధ్య కాలంలో అహం బ్రహ్మస్మి అనే టైటిల్ తో సినిమాని ఎనౌన్స్ చేశాడు.

ఈ సినిమాని తన కెరియర్ లో భారీ బడ్జెట్ తో తానే పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నాడు.శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసి అతని లుక్ తో అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.ఈ సినిమాలో చాలా పవర్ ఫుల్ కాన్సెప్ట్ తో మైథలాజికల్ ఎలిమెంట్ జోడించి చెప్పబోతున్నారని పోస్టర్ బట్టి అర్ధమైంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ కి సంబందించి తాజాగా షెడ్యూల్ ఖరారు చేశారు.నవంబర్ 2న ఈ సినిమా షూటింగ్ ని యాక్షన్ సన్నివేశాలతో స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.

హైదరాబాద్ శివారులోని ఒక ఫామ్ హౌస్ లో పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో నవంబర్ 2 నుండి ఒక యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించబోతున్నారు.సినిమాను ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏకధాటిగా చిత్రీకరించి వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయాలని భావిస్తున్నారు.

.

#Manchu Manoj #Aham Brahmasmi #Pan India Movie #@HeroManoj1 #ManchuManoj

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Manchu Manoj Aham Brahmasmi Shooting Schedule Fixed Related Telugu News,Photos/Pics,Images..