'పాలిటిక్స్ లో ఏ పార్టీ బెస్ట్.?' అని అడిగితే..మనోజ్ ఏమన్నారో తెలుసా.? నెటిజెన్స్ ఇచ్చిన ఈ కౌంటర్లు హైలైట్!  

ఈ మధ్య మంచు మనోజ్ పొలిటిక్స్‌లోకి రాబోతున్నాడంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. ‘రాయలసీమ వస్తున్నా.. మటన్ పులుసుతో రెడీగా ఉండండి’ అంటూ మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా పంచుకున్న లేఖ ఎన్నో అనుమానాలు తలెత్తేలా చేసింది. మనోజ్ రాజకీయాల్లోకి రాబోతున్నాడంటూ పుకార్లు షికారు చేశాయి. రీసెంట్ గా సోషల్ మీడియాలో పవన్ ని పొగుడుతూ పోస్ట్ పెట్టడంతో అతడు జనసేన పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు మంచు మనోజ్ స్వయంగా తను ఏ పార్టీలో చేరితేబాగుంటుందనే విషయంపై స్పందించాడు.

Manchu Manoj Funny Tweets About His Political Entry-

Manchu Manoj Funny Tweets About His Political Entry

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంచు మనోజ్ తన అభిమానులు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెబుతుంటాడు. తాజాగా ఓ నెటిజన్ ”మీ పొలిటికల్ కెరీర్ కి ఏ పార్టీ బెస్ట్” అని ప్రశ్నించారు. దీనిపై మనోజ్ చాలా సరదాగా స్పందిస్తూ.. ‘టీ పార్టీ’ అని ఆన్సర్ చేశాడు. అయితే మనోజ్ ఇచ్చిన రిప్లై మీద రకరకాల కామెంట్స్ వచ్చాయి.

Manchu Manoj Funny Tweets About His Political Entry-

టీ అంటే తెలుగు దేశం పార్టీనా భయ్యా… ఇండైరెక్టుగా బాగా చెప్పావ్ అంటూ ఓ అభిమాని వ్యాఖ్యానించారు. టీ అంటే టీడీపీ పార్టీ అనుకుంటారు జాగ్రత్త బ్రో… అంటూ ఓ అభిమాని మంచు మనోజ్‌కు సూచించారు. మరికొందరు అభిమానులు టీ పార్టీ ఎందుకు అన్నా… బీర్ పార్టీ వద్దా అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు.