మంచు లక్ష్మికి చుక్కలు చూపిస్తున్న నెటిజన్లు.. ఏమైందంటే..?

మంచు మోహన్ బాబు కూతురుగా, నటిగా సినిమా ఇండస్ట్రీలో మంచు లక్ష్మి తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.అయితే కొన్ని సందర్భాల్లో మంచు లక్ష్మీ పోస్టులు, కామెంట్లను నెటిజన్లు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే.

 Netizens Trolling Manchu Laxmi In Twitter , Manchr Laxmi , Ktr, Manchr Mohan Bab-TeluguStop.com

అయితే నెటిజన్లు తనను ట్రోల్ చేసినా వారిపై మంచు లక్ష్మీ ఎప్పుడూ సీరియస్ కాలేదు.కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ కు నిన్న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.

రాజకీయ, సినీ ప్రముఖులు కేటీఆర్ త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు.కేటీఆర్ కు కరోనా సోకడంతో మంచు లక్ష్మి ట్విట్టర్ వేదికగా “త్వరగా కోలుకోవాలి బడ్డీ.ఇప్పుడైతే నా సినిమాలు చూడు” అంటూ పోస్ట్ పెట్టారు.అయితే మంచు లక్ష్మీ చేసిన ఈ ట్వీట్ ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేయడంతో ఆమె సినిమాలపై విమర్శలు చేస్తున్నారు.

మంచు లక్ష్మీ సినిమాలను చూడటం కంటే కరోనాతో ఉండటం ఎంతో మేలు అని ఒక నెటిజన్ పేర్కొన్నారు.

Telugu Buddy, Ktr Corona, Manchulakshmi, Manchu Laxmi, Netizens, Accout-Movie

మరి కొందరు నెటిజన్లు కేటీఆర్ నీకు స్నేహితుడా.? బడ్డీ అనడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్ మంత్రి అని ఆయనకు గౌరవం ఇవ్వాలని మరి కొందరు నెటిజన్లు మంచు లక్ష్మికి ఉచిత సలహాలు ఇస్తున్నారు.

మంచు లక్ష్మీ సరదాగా తన సినిమాలను చూడమని చెప్పగా ఊహించని స్థాయిలో ఆమె ట్రోలింగ్ కు గురవుతూ ఉండటం గమనార్హం.

మరోవైపు మంచు లక్ష్మీ పీసీఆర్ టెస్ట్ గురించి కనుక్కొన్న వ్యక్తి మరణించగా వావ్ అని రియాక్షన్ ఇచ్చారు.

ఒక వ్యక్తి చనిపోతే మంచు లక్ష్మీ వావ్ అని రియాక్షన్ ఇవ్వడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.మనిషి చనిపోయిన సమయంలో మంచు లక్ష్మీ ఆ విధంగా రియాక్ట్ కావడం కరెక్ట్ కాదని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube