గ్లామరస్ ఫోటోతో రచ్చ చేస్తున్న మంచు లక్ష్మి.. నెటిజన్లు ఏమన్నారంటే..?

ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోని సినీ అభిమానులకు మంచు మోహన్ బాబు కూతురు, నటి, నిర్మాత మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.సినిమాలతో పాటు టీవీ షోలు కూడా చేస్తూ ఆ షోల ద్వారా మంచు లక్ష్మి పాపులారిటీని పెంచుకుంటున్నారు.

 Actress Manchu Laxmi Glamorous Photo Goes Viral In Social Media, Glamorous Photo-TeluguStop.com

సోషల్ మీడియాలో కొన్ని సందర్భాల్లో మంచు లక్ష్మీపై ట్రోల్స్ వచ్చినా సోషల్ మీడియా ద్వారా మంచు లక్ష్మికి మరింత పాపులారిటీ పెరగడం గమనార్హం.

తాజాగా మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా గ్లామరస్ ఫోటోలను షేర్ చేశారు.

ఆ ఫోటోలను చూసి అవాక్కవడం నెటిజన్ల వంతవుతోంది.కొన్ని సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసి నటిగా మంచు లక్ష్మి మెప్పించడం గమనార్హం.

అనగనగా ఓ ధీరుడు సినిమాలో విలన్ పాత్ర అద్భుతంగా చేయడంతో మంచు లక్ష్మీకి ఏకంగా నంది అవార్డు వచ్చింది.మంచు లక్ష్మీ సింగర్ కాగా దొంగాట మూవీలోని పాటకు మంచు లక్ష్మీ బెస్ట్ సెలబ్రిటీ సింగర్ అవార్డ్ సొంతం చేసుకున్నారు.

నటిగా చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోయిన్లకు సమాన స్థాయిలో మంచు లక్ష్మీ గుర్తింపును సొంతం చేసుకోవడం గమనార్హం.

విదేశాల్లో ఉండి భారత్ కు వచ్చిన మంచు లక్ష్మి అక్కడి కల్చర్ నే ఎక్కువగా ఫాలో అవుతారు.చిన్న స్కర్ట్ ధరించి మంచు లక్ష్మీ ఫోటోలను షేర్ చేయగా కొంతమంది నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తుంటే మరి కొందరు నెటిజన్లు ఇలాంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని మంచు లక్ష్మికి సూచిస్తున్నారు.

మంచు లక్ష్మి గ్లామరస్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.మరోవైపు మంచు లక్ష్మి హోస్ట్ గా త్వరలో కొత్త షో ప్రారంభం కానుందని ప్రచారం జరుగుతోంది.ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube