చీరకట్టులో రెచ్చిపోయి డ్యాన్స్ చేసిన మంచు లక్ష్మీ.. వీడియో వైరల్..?

మంచు మోహన్ బాబు కూతురిగా, నటిగా, నిర్మాతగా, టీవీ యాంకర్ గా వేర్వేరు రంగాలలో గుర్తింపును సొంతం చేసుకున్న మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలతో పాటు పాటు ప్రొఫెషన్ కు సంబంధించిన అప్ డేట్స్ ను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

 Manchu Laxmi Dance Video Goes Viral In Social Media-TeluguStop.com

కొన్నిసార్లు మంచు లక్ష్మీని నెటిజన్లు తీవ్రస్థాయిలో ట్రోల్ చేయడంతో పాటు ఆమెపై మీమ్స్ చేశారు.

అయితే మంచు లక్ష్మీ మాత్రం ఆ ట్రోల్స్, మీమ్స్ ను ఎక్కువగా పట్టించుకోరు.

 Manchu Laxmi Dance Video Goes Viral In Social Media-చీరకట్టులో రెచ్చిపోయి డ్యాన్స్ చేసిన మంచు లక్ష్మీ.. వీడియో వైరల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మంచు లక్ష్మీ తాజాగా చీరకట్టులో రెచ్చిపోయి మరీ డ్యాన్స్ చేశారు.నిన్న మ్యూజిక్ డే కావడంతో మంచు లక్ష్మి మాస్ బీట్ కు స్టెప్పులు వేస్తూ మంచు లక్ష్మీ డ్యాన్స్ చేసినట్టు తెలుస్తోంది.

పిచ్చిగా ఉండాలని పిచ్చెక్కించాలని ఎవరూ చూడని విధంగా డ్యాన్స్ చేయాలని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చారు.మంచు లక్ష్మీ షేర్ చేసిన ఈ వీడియోకు వేల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి.

మంచు లక్ష్మీ డ్యాన్స్ అదరగొట్టేశారని కొంతమంది కామెంట్లు చేస్తుంటే మరి కొందరు మాత్రం నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.మంచు లక్ష్మీ తన స్టైల్ కు భిన్నంగా ఈ వీడియోలో డ్యాన్స్ చేశారు.డిజైనర్ శారీ లుక్ లో ఊర మాస్ స్టెప్పులు వేస్తూ నెటిజన్లను మంచు లక్ష్మీ ఆకట్టుకున్నారు.మరోవైపు ఈ మధ్య కాలంలో మంచు లక్ష్మీ టీవీ షోలకు, సినిమాలకు దూరంగానే ఉంటున్నారు.

మంచు లక్ష్మీ మళ్లీ సినిమా, టీవీ ఆఫర్లతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.సోషల్ మీడియాలో మాత్రం మంచు లక్ష్మీ పోస్టులు చేస్తూ ఆ పోస్టుల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.కొన్ని పోస్టులపై తీవ్రస్థాయిలో ట్రోల్స్ వస్తున్నా మంచు లక్ష్మీ మాత్రం ఆ పోస్టుల విషయంలో వెనక్కు తగ్గడం లేదు.

#Dance Video #Goes Viral #Manchu Laxmi #Social Media #Mohan Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు