మంచు లక్ష్మి భయపడ్డట్లుంది!  

Manchu Lakshmi’s Dongata Movie Release Postponed -

మంచు లక్ష్మి నటించిన తాజా చిత్రం ‘దొంగాట’.ఈ సినిమాను మే 1న విడుదల చేయబోతున్నట్లుగా ఇటీవలే ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ మంచు లక్ష్మి ప్రకటించింది.

ఈ సినిమాలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించింది.ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్‌ చేయడంలో మంచు లక్ష్మి టీం సక్సెస్‌ అయ్యింది.

Manchu Lakshmi’s Dongata Movie Release Postponed--Telugu Tollywood Photo Image

ఈ సినిమాలో పలువురు హీరోలు పాల్గొన్న ఒక పార్టీ సాంగ్‌ను చిత్రీకరించారు.ఆ సాంగ్‌ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటుందని, ఆ పాటతో సినిమాను పబ్లిక్‌లోకి తీసుకు వెళ్లాలని మంచు లక్ష్మితో పాటు దర్శకుడు వంశీ కృష్ణ ప్లాన్‌ చేస్తున్నారు.

ఈ సినిమాను మే 1న విడుదల చేయాలని భావించిన చిత్ర యూనిట్‌ ఇప్పుడు ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.మే 1న కమల్‌ హాసన్‌ నటించిన ‘ఉత్తమ విలన్‌’తో పాటు లారెన్స్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గంగ’ సినిమా కూడా విడుదల అయ్యే అవకాశాలు ఉండటంతో వాయిదా వేస్తున్నట్లుగా తెలుస్తోంది.

సేఫ్‌ జోన్‌లో ఈ సినిమాను విడుదల చేసేందుకు మంచు లక్ష్మి ప్లాన్‌ చేస్తోంది.ఇప్పటికే ఈ సినిమాకు మంచి పబ్లిసిటీ వచ్చింది కనుగా, మరింత లేట్‌ చేయకుండా ఒకటి రెండు వారాల గ్యాప్‌లోనే ఈ సినిమాను విడుదల చేయాలని ఈమె భావిస్తోంది.

త్వరలో ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తామని మంచు లక్ష్మి అంటోంది.

తాజా వార్తలు

Manchu Lakshmi’s Dongata Movie Release Postponed- Related....