అందాల భామ తాప్సి బాలీవుడ్ లో వరుస హిట్స్ తో దూసుకుపోతుంది.రెగ్యులర్ హీరోయిన్స్ కి భిన్నంగా లేడీ ఒరియాంటెడ్ కథలు ఎంచుకుంటూ కంగనా తర్వాత బాలీవుడ్ లో ఆ స్థానంలోకి వచ్చేస్తుంది.
తాజాగా ఈ భామ తప్పడ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ కొట్టింది.మహిళల ఆత్మగౌరవం అనే ఎలిమెంట్ తీసుకొని ఈ సినిమాని తెరకెక్కించారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త పదిమందిలో తన మీద చేయి చేసుకుంటూ అతని నుంచి విడాకులు కావాలని కోర్టుకు వెళ్ళే గృహిణి పాత్రలో తాప్సి నటించింది.ఆమె నటనకి అందరూ ఫిదా అయిపోయారు.
విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి.తాజాగా ఈ సినిమా చూసిన మంచు లక్ష్మి తాప్సిపై ప్రశంసలు కురిపించింది.
మై డార్లింగ్ తాప్సీ.నేను నీకు అభిమాని కావటానికి ఒక్కటి కంటే ఎక్కువే కారణాలున్నాయి.ఇలాంటి అద్బుతమైన చిత్రంలో నటించిన నీకు, మిగిలిన నటీనటులు మరింత శక్తి వస్తుంది.2 వారాల క్రితం తప్పడ్ సినిమా చూశాను. భారతీయ సమాజంలోని ఓ కమ్యూనిటీ నుంచి వచ్చిన మహిళగా నేను చెప్పిన ప్రతీ అంశంపై అసలు ఏం చేయాలి.ఏం చేయకూడదంటూ అనేక ప్రశ్నలు రేకెత్తించేలా ఈ చిత్రం ఉందని ట్వీట్ లో పేర్కొంది.
దీనికి తాప్సీ రీట్వీట్ చేస్తూ వావ్ నీ సాయంతో నేను ప్రయాణం మొదలు పెట్టిన పదేళ్ల తర్వాత నిన్ను గర్వించేలా చేయడం చాలా సంతోషకరమైన విషయం.ఈ క్షణం అన్నింటి కంటే ప్రత్యేకమైనదని ప్రతీ ఒక్కరికీ తెలుసు అంటూ తాప్సి కూడా మంచు లక్ష్మికి కృతజ్ఞతలు తెలియజేసింది.