అమీర్ ఖాన్ ని పెళ్లి చేసుకోవాలని కలలు కన్న మంచువారమ్మాయి  

manchu lakshmi says her favourite hero is aamir khan, Tollywood, Telugu Cinema, Bollywood, manchu mohan Babu,collection king,tollywood news,nagarjuna - Telugu Aamir Khan, Bollywood, Manchu Lakshmi, Manchu Mohan Babu, Telugu Cinema, Tollywood

టాలీవుడ్ స్టార్ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురుగా టాలీవుడ్ లో అందరికి పరిచయం అయ్యి తరువాత నటిగా, వాఖ్యాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటి మంచు లక్ష్మి.ఆమె అమెరికన్ తెలుగు ఉచ్చారణకి విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

TeluguStop.com - Manchu Lakshmi Says Her Favourite Hero Is Aamir Khan

అయితే తనపై వచ్చే ట్రోల్స్ ని కూడా మంచు లక్ష్మి చాలా పాజిటివ్ గా తీసుకుంటుంది.నటిగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడుకి అనుకున్న స్థాయిలో సక్సెస్ రావడం లేదు.

దీంతో చాలా కాలంగా సినిమాలకి దూరంగా ఉంది.అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు సోషల్ అవేర్ నెస్ పోస్టులు పెడుతుంది.

TeluguStop.com - అమీర్ ఖాన్ ని పెళ్లి చేసుకోవాలని కలలు కన్న మంచువారమ్మాయి-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే తాజాగా మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో కాస్తా మనసు విప్పి మాట్లాడింది.

బాలీవుడ్ సూ‌ప‌ర్ స్టార్‌ ఆమీర్‌ ఖాన్‌ అంటే తనకు చాలా ఇష్టం అని మంచు లక్ష్మి ఈ ఇంటర్వ్యూలో పేర్కొంది.

ఆయనకి పెళ్లి అయిన‌ప్పుడు ఏడ్చేసాన‌ని తెలిపింది.ఇక ఆమీర్‌ ఖాన్‌ రెండో సారి పెళ్లి చేసుకునే సమయంలో కూడా ఏడ్చేశా అని తెలిపింది.అవకాశం దొరికితే అతనిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని కూడా తెలిపింది.ఇక అమీర్ ఖాన్‌ సినిమాలు సెలక్ట్ చేసుకునే విధానం, త‌న‌ను ఎంతగానో ఆకట్టుకుంటుందని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది.

మొత్తానికి బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్, విలక్షణ నటుడు అమీర్ ఖాన్ మంచు లక్ష్మి మనసుని తన టాలెంట్ తో దోచేశాడనే విషయం ఆమె మాటల బట్టి అర్ధమైంది.అలాగే టాలీవుడ్ లో నాగార్జున అంటే ఇష్టం అని మంచు లక్ష్మి పేర్కొంది.

#Manchu Lakshmi #Aamir Khan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు