హైదరాబాద్ పోలీసులకి సెల్యూట్ చేసిన మంచు లక్ష్మి

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది.ప్రజలపై దాడి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తుంది.

 Manchu Lakshmi Salutes Hyderabad Police Officers, Tollywood, Telugu Cinema, Coro-TeluguStop.com

ప్రపంచవ్యాప్తంగా కోటికిపైగా ప్రజలు కరోనా బారిన పడ్డారు.లక్షల సంఖ్యలో మృత్యువాత పడ్డారు.

ఇంకా ఎప్పటికి వరకు ఈ మహమ్మారి తన ప్రభావం చూపిస్తుందో అర్ధం కాని విషయం.ఇలాంటి వేళలో ప్రజల ప్రాణాలు రక్షించడానికి విధి నిర్వహణలో తమ కుటుంబాలని సైతం లెక్క చేయకుండా బాద్యతలు నిర్వహిస్తున్న వారు ఇద్దరే వారు పోలీసులు, డాక్టర్లు.

ఓ విధంగా చెప్పాలంటే సమాజంలో నిజమైన హీరోలు పోలీసులు అయితే నిజమైన దేవుళ్ళుగా డాక్టర్లు ఉన్నారు.వారి సేవలు అసమానం అని చెప్పాలి.

కరోనాతో ప్రాణాలకి ముప్పు అని తెలిసిన, వారిలోనే చాలా మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న విధి నిర్వహణలో ఉంటూ తమ సేవలు అందిస్తున్నారు.ఈ సందర్భంగా వారి సేవలని చాలా మంది కొనియాడుతున్నారు.

తాజాగా మంచు లక్ష్మి కూడా పోలీసులపై ప్రశంసలు కురిపించింది.కరోనా రక్కసిపై పోరాటంలో ముందు నిలిచి పోరాడుతున్న పోలీసులు నిజమైన సూపర్ హీరోలని మంచు లక్ష్మి అభివర్ణించారు.

తమకు కూడా కుటుంబాలు ఉన్నప్పటికీ ప్రజల కోసం ప్రాణాలకు తెగించి పోలీసులు సేవలు అందిస్తున్నారని, అందుకే హైదరాబాద్ పోలీసులందరికీ సెల్యూట్ చేస్తున్నానని పేర్కొన్నారు. లాక్ డౌన్ సమయంలో పోలీసులు ఎంత కష్టపడి పనిచేస్తున్నారో కళ్లారా చూస్తున్నామని, తెలంగాణ ప్రాంతంలో 98 మంది పోలీసు అధికారులకు కరోనా సోకి డ్యూటీ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

వాళ్లందరూ కోలుకుని విధుల్లో చేరారని విన్నానని, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, రాముడు, హనుమంతుడు, కృష్ణుడు అని పుస్తకాల్లో చదువుకున్నామని, కానీ పోలీసులే ప్రత్యక్ష దైవాలని పేర్కొన్నారు.పోలీసులకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు తెలిపినా రుణం తీరదని అన్నారు.

ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశారు.ఈ వీడియోను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ట్విట్టర్ లో పంచుకున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube