మంచు లక్ష్మి రాజకీయాలపై క్లారిటీ ఇచ్చేసింది

మంచు ఫ్యామిలీ వైకాపాకు రాజకీయంగా మద్దతు అనే విషయం ప్రతి ఒక్కరికి తెల్సిందే.ఎన్నికల ముందు మోహన్‌బాబు స్వయంగా వెళ్లి వైకాపా కండువా కప్పుకున్నాడు.

 Manchu Lakshmi,politics, Bjp, Narendra Modi, Manchu Lakshmi Not Interested In Po-TeluguStop.com

తెలుగు దేశం పార్టీపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు.ఒకనొక సమయంలో బీజేపీకి కూడా వీళ్లు మద్దతు తెలియజేశారు.

ప్రధాని నరేంద్ర మోడీతో మంచు లక్ష్మి ఫొటోలు తీసుకోవడం ఆయనకు మద్దతుగా నివడం వంటివి చేసింది.ఇన్ని రకాలుగా చేసినా కూడా మంచు లక్ష్మి బీజేపీకి మద్దతు కాదంటుంది.

తాజాగా రాజకీయాల గురించి మంచు లక్ష్మి మాట్లాడుతూ తాను రాజకీయాలకు దూరంగా ఉన్నాను.తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు.తాను పూర్తిగా ఒక రాజకీయ పార్టీకి మద్దతు అని కాకుండా మంచి విధి విధానాలు అమలు చేసే వారికి మద్దతుగా ఉంటాను అంటూ పేర్కొంది.ఏ రాజకీయ పార్టీ కూడ పూర్తిగా ప్రజలకు న్యాయం చేయలేక పోతుందని ఈ సందర్బంగా మంచు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది.

ఏపీలో ఇంగ్లీష్‌ మీడియంకు ఈమె అభ్యంతరం చెప్పింది.

Telugu Manchu Lakshmi, Narendra Modi-

నటిగా నిర్మాతగా, దర్శకురాలిగా, వ్యాపారవేత్తగా ఇలా పలు రంగాల్లో తనదైన ముద్రను వేసిన మంచు లక్ష్మి ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇస్తుందని అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఇలా రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పడం ఒకింత నిరుత్సాహంకు గురి చేస్తుంది.ఆమె మళ్లీ భవిష్యత్తులో అయినా రాజకీయాల పట్ల ఆసక్తిని చూపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube