మంచులక్ష్మి విన్యాసాలు.. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమేనట.. వీడియో వైరల్!

Manchu Lakshmi Learns Kalaripayattu

టాలీవుడ్ హీరో మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో షేర్ చేసే వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.

 Manchu Lakshmi Learns Kalaripayattu-TeluguStop.com

ఈమె మాట్లాడే తెలుగు ఫై ఇప్పటికే చాలాసార్లు నెటిజన్స్ ట్రోలింగ్స్ కూడా చేశారు.ఆమెకు తెలుగు సరిగ్గా రాకపోవడానికి కారణం ఆమె ఎక్కువ రోజులు అమెరికాలో నివసించడమే.

ఈమె మాట్లాడే తెలుగును బేస్ చేసుకుని చాలా మంది నెటిజన్లు చాలా రకాల వీడియోలను చేశారు.

 Manchu Lakshmi Learns Kalaripayattu-మంచులక్ష్మి విన్యాసాలు.. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమేనట.. వీడియో వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న మంచు లక్ష్మీ ఇప్పుడిప్పుడె మళ్లీ కెమెరా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల ఆమె ఆహా కోసం కుకింగ్ షో చేసింది.ఆ తరువాత మళ్లీ కనిపించలేదు.

ఆహా భోజనంబు అంటూ మంచు లక్ష్మీ బాగానే రచ్చ చేసింది.కానీ ఆ షో ఆగిపోవడంతో మంచు లక్ష్మీ తన కొత్త ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంటున్నట్టు కనిపిస్తోంది.

ఈ క్రమంలోనే లక్ష్మీ ఒక తమిళ సినిమా కోసం బాగా కష్టపడుతున్నట్టు కనిపిస్తోంది.

ప్రస్తుతం మంచు లక్ష్మీ ఓ కొత్త విద్యను నేర్చుకుంటోంది.

ఇది సినిమా కోసమా?కాదా?అన్నది తెలియడం లేదు.

కానీ తాజాగా తన ట్రైనింగ్ సెషన్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేసింది మంచు లక్ష్మి.అందులో ఏదైనా కొత్తది నేర్చుకుంటుంటే వచ్చే ఆనందం వేరు,కేరళలో అతి ప్రాచీనమైన కలరిపట్టు విద్య.300 బీసీ శకంలో ఈ విద్య పుట్టింది.మాన్ స్టర్స్ కోసం ఈ విద్యను నేర్చుకుంటున్నాను.పగలు రాత్రి అని తేడా లేకుండా క్రిష్ణ దాస్, ఆయన కూతురు కావ్య నాయర్ వద్ద ఈ విద్యను నేర్చుకుంటున్నాను అని మంచు తెలిపింది.

ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

#Aha Bhojanambu #Kalaripayattu #Kerala #Monsters #Manchu Lakshmi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube