మూసుకొని ఇంట్లో కూర్చుందాం.. మంచు లక్ష్మి కామెంట్స్ వైరల్..?

మంచు మోహన్ బాబు కూతురుగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నటిగా, నిర్మాతగా మంచు లక్ష్మి గుర్తింపును సొంతం చేసుకున్నారు.సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉండే మంచు లక్ష్మికి పలు సందర్భాల్లో నెటిజన్ల నుంచి ప్రశంసలు దక్కితే ఎక్కువసార్లు మాత్రం విమర్శలు వ్యక్తమయ్యాయి.

 Manchu Lakshmi Different Hash Tags On Corona Virus-TeluguStop.com

అయితే తాజాగా మూసుకొని ఇంట్లో కూర్చుందాం అంటూ మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.

శాస్త్రవేత్తలు ఇటీవల ఏపీలోని కర్నూలు జిల్లాలో భయంకరమైన ఎన్440కె మ్యూటంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతుందని వెల్లడించారు.

 Manchu Lakshmi Different Hash Tags On Corona Virus-మూసుకొని ఇంట్లో కూర్చుందాం.. మంచు లక్ష్మి కామెంట్స్ వైరల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ కేసులు ఈ వేరియంట్ వల్లే నమోదవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అయితే శాస్త్రవేత్తలు చేసిన ప్రకటనపై మంచు లక్ష్మి భిన్నంగా స్పందిస్తూ మూసుకొని ఇంట్లో కూర్చుందామని పేర్కొన్నారు.
ప్రస్తుతం మంచు లక్ష్మీ కొన్ని వెబ్ సిరీస్ లలో నటించడానికి ఒకే చెప్పారని తెలుస్తోంది.నిర్మాతగా మంచు లక్ష్మి నిర్మించిన చిత్రాలు డిజాస్టర్లు కావడంతో ఆమె గత కొంతకాలంగా చిత్ర నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు.

మరోవైపు మంచు లక్ష్మీ రియాలిటీ షోలలో, ఈవెంట్లలో కూడా పాల్దొంటూ సందడి చేస్తుండటం గమనార్హం.నటిగా మంచు లక్ష్మీ మాత్రం మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు.

మంచు లక్ష్మీ నటించిన సినిమాలు హిట్టై ఉంటే మాత్రం ఆమె నటిగా మరింత బిజీ అయ్యి ఉండేది.ఇంట్లో మూసుకొని కూర్చోండి అంటూ మంచు లక్ష్మి చేసిన కామెంట్ పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొన్ని రోజుల క్రితం కేటీఆర్ కరోనా బారిన పడిన సమయంలో మంచు లక్ష్మీ చేసిన కామెంట్లు తెగ ట్రోల్ అయ్యాయి.అయితే మంచు లక్ష్మీ మాత్రం నెటిజన్ల విమర్శలను స్పోర్టివ్ గా తీసుకుంటున్నారు.

మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా భయంకరమైన విషయాన్ని చెప్పారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

#Twitter Post #ManchuLakshmi #Manchu Lakshmi #Manchu Laxmi #ManchuLakshmi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు