స్టార్‌ హీరోలతో మంచు లక్ష్మి స్టెప్పులు  

Manchu Lakshmi Dance With Top Heroes -

మంచు లక్ష్మి తాజా చిత్రం ‘దొంగాట’.ఈ సినిమాలో రానా అతిధి పాత్రలో నటిస్తున్న విషయం ఇప్పటికే చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.

తాజాగా ఈ సినిమాలో మరి కొంత మంది హీరోలు కూడా మెరవబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.బాలీవుడ్‌ మూవీల్లో పార్టీ సాంగ్స్‌లో పలువురు స్టార్‌ హీరోలు కనిపిస్తూ ఉంటారు.

Manchu Lakshmi Dance With TOp Heroes--Telugu Tollywood Photo Image

అలాగే ‘దొంగాట’ సినిమాలో కూడా ఒక పార్టీ సాంగ్‌ ఉండనుందట.ఆ పార్టీ సాంగ్‌లో టాలీవుడ్‌ సెలబ్రెటీలు పలువురు కనిపించనున్నట్లుగా చిత్ర యూనిట్‌ వర్గాల వారు చెబుతున్నారు.

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఆ పాటలో టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున, రవితేజ, నాని, రానా, మంచు విష్ణు, మంచు మనోజ్‌, తమిళ హీరోలు శింబు, ఆది, సందీప్‌ కిషన్‌, హీరోయిన్‌ తాప్సి ఇంకా పలువురు దర్శనమివ్వనున్నట్లుగా తెలుస్తోంది.ఈ జాబిత మరింతగా పెరిగే అవకాశాలున్నాయని అంటున్నారు.

థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మంచు లక్ష్మి సినిమా నటిగా నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.ఈ సినిమాను మంచు లక్ష్మి స్వయంగా నిర్మిస్తోంది.

ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌ను జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

తాజా వార్తలు

Manchu Lakshmi Dance With Top Heroes- Related....