తీన్మార్ స్టెప్పులతో రెచ్చిపోయిన మంచు లక్ష్మి..!

తెలుగు సినీ నటి, బుల్లితెర వ్యాఖ్యాత మంచు లక్ష్మి గురించి అందరికీ తెలిసిందే.ప్రముఖ తెలుగు సీనియర్ నటుడు డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు.

 Manchu Lakshmi Dance Steps Mohanbabu Birthday Celebrations Manchu Lakshmi, Mohan-TeluguStop.com

ఇక ఈమె తెలుగు సినిమాలలో నటించగా అంత క్రేజ్ మాత్రం అందుకోలేకపోయింది.ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో బిజీగా ఉంటుంది.

అంతేకాకుండా బుల్లితెరలో ఒక షో లో వ్యాఖ్యాతగా కూడా పనిచేసింది.ఇదిలా ఉంటే తీన్మార్ స్టెప్పులతో రెచ్చిపోయిన లక్ష్మి వీడియో వైరల్ గా మారింది.
ఇటీవలే మార్చి 19న మోహన్ బాబు తన 69వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే.ప్రతి ఏడాది జరుపుకొనే తన సొంత విద్యా సంస్థ అయిన విద్యానికేతన్ లో తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.

అక్కడ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో తెగ సందడి చేశారు.ఇక మంచు లక్ష్మి తన తీన్మార్ డాన్స్ స్టెప్పులతో బాగా రెచ్చిపోయింది.ఆ డాన్స్ తో తెగ ఇరగదీసింది.ఇక డాన్స్ వీడియోలను మంచు లక్ష్మి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్స్ తో పంచుకోగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

Telugu Dance, Manchu Lakshmi, Mohanbabu, Tollywood-Movie

ఇదిలా ఉంటే ఇదివరకు మంచులక్ష్మి తన కుటుంబ సభ్యులతో కలిసి తన నాన్నకు సప్రైజ్ ఇస్తూ స్పెషల్ డిన్నర్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.మంచు లక్ష్మి ఎప్పటికప్పుడు తన కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలను పంచుకుంటుంది.ఇక తన సోదరుడు మంచు మనోజ్ ప్రేమించి పెళ్లి చేసుకోగా వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు.ఆ తర్వాత తమ దగ్గర బంధువు కుమార్తెతో తన వివాహం జరగనుందని వార్తలు రాగా దీనిపై ఈ కుటుంబం నుంచి ఎటువంటి స్పందన రాకపోయేసరికి ఈ విషయం నిజమేనంటూ నెటిజనులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube