మంచు లక్ష్మిని అంతగా మోసం చేసిన నిర్మాత ఎవరు?  

Manchu Lakshmi Comments On Bellamkonda Suresh-

సినీ పరిశ్రమలో మంచు లక్ష్మి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. మంచు మోహన్‌బాబు కూతురుగా ప్రేక్షకులకు పరిచయం అయిన మంచు లక్ష్మి ఆ తర్వాత నటిగానే కాకుండా నిర్మాతగా కూడా తనదైన శైలిలో చిత్రాలను నిర్మిస్తూ వచ్చింది. మంచి చిత్రాలను నిర్మించాలనే ఉద్దేశ్యంతో మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ను స్థాపించిన మంచు లక్ష్మి తాజాగా ‘వైఫ్‌ ఆఫ్‌ రామ్‌’ అనే చిత్రాన్ని నిర్మించడం జరిగింది...

మంచు లక్ష్మిని అంతగా మోసం చేసిన నిర్మాత ఎవరు?-Manchu Lakshmi Comments On Bellamkonda Suresh

ఈ చిత్రంతో నిర్మాతగా మంచు లక్ష్మికి నష్టాలు తప్పలేదు. అంతకు ముందు ఈమె నిర్మించిన ‘గుండెల్లో గోదావరి’ చిత్రం కూడా ఫ్లాప్‌ అయ్యింది.

‘గుండెల్లో గోదావరి’ చిత్రం కోసం చేసిన అప్పులను ఇంకా తీర్చుతూనే ఉన్నాను అంటూ చెప్పుకొచ్చిన మంచు లక్ష్మి, తనకు రావాల్సిన మొత్తంలను ఒక నిర్మాత ఇవ్వకుండా చేతులు దులిపేసుకున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

తాను ఎవరికైనా బాకి ఉంటే వారి బాకి తీర్చే వరకు మనస్సు అదోలా ఉంటుంది. కాని ఒక నిర్మాత మాత్రం తనకు 25 లక్షలు బాకీ ఉన్నాడు. ఆ నిర్మాత వద్ద డబ్బు ఉన్నా కూడా తనకు ఇచ్చేందుకు మనస్సు ఒప్పడం లేదు, ఆయన వేరు పేరుతో పెద్ద సినిమాలను నిర్మిస్తున్నాడు, కాని చిన్న మొత్తాలను ఇచ్చేందుకు మాత్రం ఆయన ముందుకు రావడం లేదు అంటూ చెప్పుకొచ్చింది.

మంచు లక్ష్మికి 25 లక్షలు ఇవ్వాల్సిన ఆ నిర్మాత ఎవరా అని అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మంచు లక్ష్మి నిర్మాణంలో మంచు మనోజ్‌, బాలకృష్ణల కాంబోలో ఒక చిత్రం వచ్చింది.

ఆ చిత్రం కోసం భారీ సెట్టింగ్‌ను నిర్మించింది. సెటింగ్‌ అదిరి పోవడంతో ఎన్టీఆర్‌ ‘రభస’ చిత్రాన్ని అదే సెట్స్‌లో తెరకెక్కించారు. ఆ సెట్స్‌ కిరాయి నిమిత్తం నిర్మాత బెల్లంకొండ సురేష్‌ 40 లక్షల రూపాయలను మంచు లక్ష్మికి బాకీ పడ్డాడు. ఆ బాకీ డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరుతుండగా, ఐపీ పెట్టేశాడు...

తన కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్‌తో పెద్ద మొత్తంలో ఖర్చు చేసి ఇతరుల పేరుతో సినిమాలు నిర్మిస్తున్న బెల్లంకొండ సురేష్‌ తనకు రావాల్సిన డబ్బుతో పాటు, ఇంకా ఎంతో మంది టెక్నీషియన్స్‌ డబ్బును ఇవ్వడం లేదు అంటూ మంచు లక్ష్మి చెప్పకనే చెప్పింది.

మంచు లక్ష్మి చేస్తున్న ఆరోపణలపై నిర్మాత బెల్లంకొండ సురేష్‌ స్పందించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆర్థికంగా సరిగా లేని సమయంలో మంచు లక్ష్మి నిర్మాణంలోకి అడుగు పెట్టడంపై కొందరు విమర్శలు చేస్తున్నారు.

ఆర్థిక ఇబ్బందులు ఉంటే సినిమాల్లో నటిస్తే సరిపోయే, మరి సినిమా నిర్మాణం ఎందుకు అంటున్నారు.