నటి,నిర్మాత మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేసే పోస్టులు, కామెంట్స్ దారుణమైన ట్రోలింగ్ కి గురవుతూ సోషల్ మీడియాలో కాంట్రవర్సి కూడా కారణమవుతుంటాయి.
అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది సెలబ్రెటీలు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి హోమ్ టూర్, వీడియోలు చేసి వారి ఛానల్ లో పోస్ట్ చేయడం కామన్ అయిపోయింది.ఈ క్రమంలోనే నటి మంచు లక్ష్మి కూడా తన హోమ్ టూర్ వీడియో తీసి ఆ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.ఈ వీడియో ద్వారా తన ఇల్లు ఎంత విలాసవంతమైనదో ఎలా ఉందనే విషయాలన్నింటినీ లక్ష్మి మంచు చూపించారు.
ఈ క్రమంలోనే మంచు లక్ష్మి ట్విట్టర్ ద్వారా మరొక వీడియోను షేర్ చేశారు.అయితే ఈ సారి ముందస్తు జాగ్రత్త చర్యగా లక్ష్మి మంచు ఎలాంటి ట్రోలింగ్ కి గురి కాకుండా ఉండటం కోసం ముందుగానే జాగ్రత్త పడింది.
లక్ష్మీ మంచు తన స్నేహితులతో కలిసి ఓ వివాహ కార్యక్రమానికి హాజరైనట్లు తెలుస్తోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా తన స్నేహితురాళ్లతో కలిసి లక్ష్మీ మంచు బాగానే ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది.ఈ వేడుకలో హీరో నవదీప్ కూడా తళుకుమన్నాడు. అందరూ కలిసి ఎంతో సరదాగా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు కానీ ఇక్కడ ఉన్న వారు ఏ ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకోలేదు.
దీనిపై మంచు లక్ష్మి క్లారిటీ ఇస్తూ కేవలం ఫోటో కోసం మాత్రమే మాస్కులు తీసేశామని తెలియజేశారు.లేదంటే మాస్కులు లేవు, కరోనా నిబంధనలను ఉల్లంఘించారని పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తారని లక్ష్మీ మంచు ముందుగా జాగ్రత్తపడి ఈ విధమైనటువంటి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈమె షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.