మంచు లక్ష్మి ఆవేదన : రియాకు మద్దతు ఇవ్వడం నేను చేసిన నేరమా

మంచు లక్ష్మి తాను ఏదైతే అనుకుంటుందో అది నిర్మొహమాటంగా మాట్లాడేస్తుంది.సుశాంత్‌ కేసులో రియా చక్రవర్తిని కొందరు టార్గెట్‌ చేస్తున్నారు అంటూ మొదట మంచు లక్ష్మి గళం ఎత్తింది.

 Manchu Lakshmi About Social Media Comments , Manchu Lakshmi, National Media, Rhe-TeluguStop.com

దేశం మొత్తం ఆమెను దోషిగా చూస్తున్న సమయంలో మంచు లక్ష్మి మొదట ఐ సపోర్ట్‌ రియా అంటూ ఒక హ్యాష్‌ ట్యాగ్‌ ను ట్వీట్‌ చేసింది.సుశాంత్‌ విషయంలో నిజా నిజాలు బయటకు రావాలి.

ఇదే సమయంలో రియా చక్రవర్తిని ఇబ్బందికి గురి చేయవద్దు.ఆమె నేరం రుజువు కాకుండా ఎలా మీరు ఇంతగా టార్గెట్‌ చేస్తారు అంటూ మీడియాను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది.

రియా చక్రవర్తికి మద్దతుగా నిలిచినప్పటి నుండి మంచు లక్ష్మిని సోషల్‌ మీడియాలో కొందరు టార్గెట్‌ చేసి బ్యాడ్‌ కామెంట్స్‌ చేయడంతో పాటు అసభ్యకరంగా మీమ్స్‌ పోస్ట్‌ చేస్తున్నారు.మొత్తానికి సోషల్‌ మీడియాలో మంచు లక్ష్మి గురించి చాలా నీచంగా పోస్ట్‌లు వస్తున్నాయి.

ఈ విషయమై ఆమె స్పందించింది.

నేను సాటి మహిళగా రియాకు మద్దతుగా నిలవడం నేను చేసిన తప్పా అంటూ నెటిజన్స్‌ ను మరియు జాతీయ మీడియాను ప్రశ్నించింది.

ఒక వ్యక్తిని ఇంత మంది వెంబడించడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ ఆమె అసహనం వ్యక్తం చేసింది.మూడు నాలుగు దర్యాప్తు సంస్తలు ఒక్క మహిళపై పడటం అనేది ఏంటీ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ కేసు విషయమై మంచు లక్ష్మి మాట్లాడకూడదు అంటూ దర్యాపు సంస్థలు పేర్కొన్నారు.ఆ విషయమై స్పందిస్తూ తమ నోరు మూయిస్తున్న మీరు మీడియా నోరు మూయించడంలో ఎందుకు విఫలం అవుతున్నారు అంటూ దర్యాప్తు సంస్థలకు సూటి ప్రశ్న వేసింది.

రియా విషయంలో మద్దతుగా నిలవడం నేను చేసిన పెద్ద తప్పు.ఇకపై ఎవరి విషయంలో కూడా నేను వకాల్త పుచ్చకోవాలనుకోవడం లేదు అంటూ మంచు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube