ఏం మనుషులురా బాబూ.. ఇలాంటి వారి వల్ల వేగంగా వ్యాపిస్తున్న కరోనా.. !

ప్రపంచ దేశాల సంగతి పక్కన పెడితే మన దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటానికి కారణం మాత్రం ప్రజల నిర్లక్ష్యం అని చెప్పవచ్చూ.కరోనా వైరస్ గురించి నిత్యం వార్తల్లో చదువుతూ, దీని బారిన పడితే జరిగే నష్టాలు కళ్లతో చూస్తూనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జనం వల్ల నేడు కరోనా ఈ స్దాయికి పెరిగింది.

 Mancherial Photo Studio Owner Opens The Shop Without Completing Home Isolation Of Corona-TeluguStop.com

తమ వల్ల తోటి వారు ఇబ్బందులకు గురవుతారనే కనీస సృహ కూడా లేకుండా ప్రవర్తిస్తున్న మనుషులను చూస్తే కోపం రాక మానదు.అందులో ఇప్పుడు మనం చదవబోయే ఘటన కూడా ఇలాంటిదే.

ఆ వివరాలు చూస్తే.

 Mancherial Photo Studio Owner Opens The Shop Without Completing Home Isolation Of Corona-ఏం మనుషులురా బాబూ.. ఇలాంటి వారి వల్ల వేగంగా వ్యాపిస్తున్న కరోనా.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మంచిర్యాల జిల్లా దండ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దండేపల్లి లో ఉన్న వెంకటేశ్వర కమ్యూనికేషన్ అండ్ ఫోటో స్టూడియో షాప్ యజమాని కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందట.

కాగా ఈ మహానుభావుడు 17 రోజుల ఐసోలేషన్ పూర్తి కాకముందే ఇంటి నుండి బయట వచ్చి తన షాపులు తెరవడం జరిగింది.

అయితే ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో దండేపల్లి ఎస్ఐ శ్రీకాంత్ అతని దగ్గరికి వెళ్లి షాప్ క్లోజ్ చేపించి అతనిపై సెక్షన్ 188,269 ఐపిసి సెక్షన్ 3 ఎపిడెమిక్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు.

#Shop Owner #Police Case #Home Isolation #Danda Palli #Epidemic Act

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు