సంచ‌యిత‌కు మామూలు షాక్ కాదుగా… అదే దెబ్బేసిందా..!  

a big shock to sanchayitha gajapathi raju, MANASAS trust chair man, sanchayitha, gajapathi raju, ashoka gajapathi raju, twitter, war, tweets, hot topic, TDP, YSRCP - Telugu Ashoka Gajapathi Raju, Gajapathi Raju, Manasas, Sanchayitha, Tdp, Trust Chair Man, Tweets, Twitter, War, Ysrcp

మాన్సాస్ ట్ర‌స్ట్ చైర్ ప‌ర్స‌న్ సంచ‌యితా గ‌జ‌ప‌తిరాజు దూకుడుపై విజ‌య‌న‌గ‌రంలో ఇప్పుడు క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకొంటున్నారు.కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత‌.

TeluguStop.com - Manasas Sanchayitha Gajapathi Raju Tdp Anand Gajapathi Raju

అశోక్ గ‌జ‌ప‌తిరాజును రాజ‌కీయంగా దెబ్బ‌కొట్టే వ్యూహంలో భాగంగా అప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న చైర్మ‌న్‌గా ఉన్న సింహాచ‌లం అప్ప‌న్న దేవాల‌యం బోర్డు స‌హా మాన్సాస్ ట్ర‌స్ట్ బోర్డుల‌ను జ‌గ‌న్ స‌ర్కారు సంపూర్ణంగా ప్ర‌క్షాళ‌న చేసింది.ఈక్ర‌మంలోనే ఆనంద గ‌జ‌ప‌తి రాజు తొలి వైవాహిక‌ సంతానం అయిన బీజేపీ నాయ‌కురాలు.

సంచ‌యిత‌ను తీసుకువ‌చ్చి.ఈ రెండు ప‌ద‌వుల‌ను అప్ప‌గించారు.

TeluguStop.com - సంచ‌యిత‌కు మామూలు షాక్ కాదుగా… అదే దెబ్బేసిందా..-General-Telugu-Telugu Tollywood Photo Image

కొన్నాళ్ల కింద‌ట ఇది పెద్ద వివాదంగా మార‌డం.టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ నేత‌ల మ‌ధ్య విమ‌ర్శ‌లు రావ‌డం తెలిసిందే.

ప్ర‌స్తుతం ఈ కేసు కోర్టులోనూ న‌డుస్తోంది.ఇదిలావుంటే.

సంచ‌యిత‌.తాజాగా చేసిన ఓ ప‌ని.

ఆమెపై విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేసింది.రెండు రోజుల కింద‌ట‌.

విజ‌య‌న‌గ‌రంలో ప్ర‌తిష్టాత్మ‌కమైన‌.పైడిత‌ల్లి సిరిమానోత్స‌వం నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మానికి మాన్సాస్ ట్ర‌స్ట్ చైర్ ప‌ర్స‌న్ హోదాలో సంచ‌యిత కూడా హాజ‌ర‌య్యారు.క‌రోనా నేప‌థ్యంలో చాలా క‌ట్టుదిట్టంగా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

అయితే, ప్రొటోకాల్ ప్ర‌కారం.ఆనంద గ‌జ‌ప‌తి రాజు కుటుంబాన్ని ఆహ్వానించారు.

దీంతో ఆనంద గ‌జ‌ప‌తిరాజు రెండో భార్య‌, వీరి పుత్రిక ఊర్మిళ‌లు ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చారు.ఈక్ర‌మంలో ఆన‌వాయితీ ప్రకారం.

వీరికి గ‌జ‌ప‌తుల కోట‌పై ఆస‌నాలు ఏర్పాటు చేశారు.ఈ వ‌ర‌సుల్లో తొలి వ‌రుస‌లో గ‌జ‌ప‌తుల కుటుంబం కూర్చొని సిరిమానోత్స‌వం వీక్షించ‌డం ఆన‌వాయితీ.

ఈ ప్ర‌కార‌మే.ఊర్మిళ‌, ఆమె త‌ల్లి కూడా అక్క‌డ కూర్చోని వీక్షిస్తున్నారు.

ఈ స‌మ‌యంలో అక్క‌డ‌కు వ‌చ్చిన సంచ‌యిత‌.వీరు కూర్చున్న కుర్చీల‌ను ఖాళీ చేయించాలంటూ.

ప‌క్క‌నే ఉన్న డీఎస్పీని ఆదేశించారు.అయితే, స‌ద‌రు డీఎస్పీ.

తాను ప్రొటోకాల్ పాటించాన‌ని.ఈ విష‌యంలో మీరూ మీరూ చూసుకోండ‌ని చెప్ప‌డంతో సంచ‌యిత అవ‌మానానికి గుర‌య్యారు.

కొద్ది సేప‌టికి ఊర్మిళ‌.ఆమె త‌ల్లి.అక్క‌డ నుంచి నిష్క్ర‌మించిన త‌ర్వాత సంచ‌యిత కూర్చోన్నారు.కానీ, ఈ విష‌యం అప్ప‌టికే సోష‌ల్ మీడియాకు ఎక్కేసింది.దీంతో సంచ‌యిత‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.ఇంత దూకుడు మంచికాద‌ని.

ప్ర‌తి ఒక్క‌రూ దుమ్మెత్తిపోశారు.ఇక‌, ఊర్మిళ అయితే.

ఈ విష‌యాన్ని ఎలా స‌రిదిద్దాలో త‌న‌కు తెలుసున‌ని.స‌రైన స‌మ‌యంలో బుద్ధి చెబుతాన‌ని ట్వీట్ చేయ‌డం.

ఆస‌క్తిగా మారింది.మొత్తానికి సంచ‌యిత‌.

కుటుంబంపై చేసిన దూకుడు వ్య‌వ‌హారం విమ‌ర్శ‌ల‌కు దారితీసింది.

#Trust Chair Man #Twitter #AshokaGajapathi #Gajapathi Raju #Ysrcp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Manasas Sanchayitha Gajapathi Raju Tdp Anand Gajapathi Raju Related Telugu News,Photos/Pics,Images..