పవన్ తో నటించడం లేదు... క్లారిటీ ఇచ్చిన మల్లు బ్యూటీ

వపర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లుతో పాటు అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ సినిమాలని చేస్తున్నాడు.ఈ రెండు షూటింగ్ దశలోనే ఉన్నాయి.

 Manasa Radhakrishnan Gives Clarity On Rumors-TeluguStop.com

వీటి తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.ఈ మూవీని భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.

ఆగష్టు, సెప్టెంబర్ లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంటుందని టాక్ వినిపిస్తుంది.ఇక ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే, రష్మిక, సమంతా పేర్లు తెరపైకి వచ్చాయి.

 Manasa Radhakrishnan Gives Clarity On Rumors-పవన్ తో నటించడం లేదు… క్లారిటీ ఇచ్చిన మల్లు బ్యూటీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే వీరందరి కంటే ముందుగా మలయాళీ యంగ్ హీరోయిన్ మానస రాధాకృష్ణన్ పేరు గట్టిగా వినిపించింది.ఆమెని హీరోయిన్ గా ఖరారు చేసేసారని ప్రచారం జరిగింది.

దాంతో ఈ అమ్మడు పేరు టాలీవుడ్ లో ఒక్కసారిగా పాపులర్ అయిపొయింది. పవర్ స్టార్ అభిమానులు అయితే సోషల్ మీడియాలో ఆమె గురించి శోధించడం మొదలు పెట్టారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడంపై క్లారిటీ ఇచ్చింది.పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమే కాని ప్రస్తుతానికి ఆయనకీ జోడీగా నటించడం లేదని స్పష్టం చేసింది.

ఈ విషయంపై తనని ఎవరూ సంప్రదించలేదని పేర్కొంది.భవిష్యత్తులో అవకాశం వస్తే కచ్చితంగా పవన్ కళ్యాణ్ తో నటిస్తా అని చెప్పింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ్, మలయాళీ బాషలలో వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది.మొత్తానికి హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ మానసని ఎంపిక చేయలేదని ఆమె మాటలబట్టి తెలిసింది.

మరి కళ్యాణ్ బాబుకి జోడీగా ఎవరిని హరీష్ రంగంలోకి దించుతాడు అనేది చూడాలి.

#Pawan Kalyan #MythriMovie #Harish Shankar #Rumors

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు