పవన్ కళ్యాణ్ ని చూస్తే మానస్ అలా ఫీల్ అవుతాడా..?

బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ లలో ఒకరైనా మానస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న మానస్, బిగ్ బాస్ తో మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు.

 Manas Reaction-after Watching Pawan Kalyan In Bigg Boss Telugu 5 Manas, Pawan Ka-TeluguStop.com

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు, కూల్ గా, మెచ్యూర్ గేమ్స్ ఆడుతూ వస్తున్నాడు.దీంతో బయట మానస్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది.

అంతేకాకుండా ఈ సీజన్ లో టాప్ 5 లిస్టులో మానస్ కూడా ఉంటారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ సూపర్ ఎక్సైట్ అయినట్టు ఒకసారి కూడా తన మొహంలో కనిపించలేదు.

కానీ ఇప్పుడు చిన్నపిల్లాడిలా మారిపోయాడు మానస్.పవన్ కళ్యాణ్ ఫోటో చూడగానే ఏం చేస్తున్నాడో కూడా మర్చిపోయాడు.తాజాగా జరిగిన టాస్క్ లో మానసిక స్థితిగతులు వేసిన తీరు చూసి అతని అభిమానులు ఫిదా అయ్యారు.మానస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా! ఆ గెంతులు ఏంటి అంటూ నెటిజన్లు సరదాగా ట్రోలింగ్స్ కూడా చేస్తున్నారు.

Telugu Manas, Nagarjuna, Pawan Kalyan, Telugu Biggboss-Latest News - Telugu

సండే, ఫండే ఎపిసోడ్ లో భాగంగా సెలబ్రెటీలకు సంబంధించిన చిన్నప్పటి ఫోటోలు చూపిస్తే వాటిని గుర్తుపట్టాలి అనే టాస్క్ ను ఇచ్చాడు బిగ్ బాస్.పవన్ చిన్నప్పటినుండి ఫోటోని చూడగానే ఎవరు గుర్తు పట్టలేకపోయారు.ఆ టాస్క్ కి మానస్ సంచాలకుడిగా ఉన్నాడు. పవన్ ఫోటో చూడగానే వెనకనుంచి కుప్పి గంతులు వేయడం మొదలుపెట్టాడు మానస్.చెప్పండి చెప్పండి అంటూ గట్టిగా అరిచాడు.నాగార్జున టైం అఫ్ అనగానే ఈ సారి సంచాలకుడిగా అవకాశం ఇవ్వమని అడిగాడు.

నాగార్జున ఓకే చెప్పడంతో వెంటనే పవన్ కళ్యాణ్ అంటూ సమాధానం ఇచ్చాడు.అంతే కాకుండా ఆ పవన్ పాటకు సోలోగా డాన్స్ చేసి అదరగొట్టాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube