మానస్ లవ్ స్టోరీని బయటపెట్టేసిన మానస్ తల్లి.. నెట్టింట్లో వైరల్?

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన మానస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తాజాగా మానస్ గురించి తన తల్లి ఓ ఇంటర్వ్యూలో మానస్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

 Manas Mother Revealed Manas Love Story It Goes Viral, Bigg Boss 5, Telugu, Manas-TeluguStop.com

ఇంటర్ చదువుతుండగా ఒక అమ్మాయితో ఏర్పడిన పరిచయం గురించి తనకు తెలుసని ప్రస్తుతం తను యూఎస్ లో ఉందని అతని తల్లి చెప్పుకొచ్చారు.అమ్మాయి అలా యూఎస్ వెళ్తున్నప్పుడు మానస్ తనతో చెప్పాడని ఇప్పుడు ఏం చేయాలని అని తనని అడిగినప్పుడు ఇప్పుడు నీ ఏజ్ కేవలం 20 మాత్రమే కాబట్టి ఈ టైంలో వెళ్లి జాబ్ వెతుక్కోవడం ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదేమో అని, ఇంకా చాలా టైం ఉంది కదా అన్నట్టు తెలిపారు.

కేవలం తన మాట విని అప్పుడు మానస్ వెళ్లకుండా ఆగిపోయాడు అని ఆమె చెప్పారు.

ప్రస్తుత కాలంలో పిల్లలు ఎలా ఉన్నారు అంటే పెద్ద వాళ్లకి ఎదురు సమాధానం చెప్పి వాళ్లకి ఇష్టమైంది చేస్తున్నారు.

కానీ మానస్ అలా చేయకుండా చెప్పిన మాట విన్నాడని, అసలు అలా ఎవరు ఉంటారు అని ఆమె చెప్పారు.ఇకపోతే ఆ అమ్మాయి అలా వెళ్లిపోయిన తర్వాత ఆమెకు పెళ్లయిపోయింది.

ఐనా కూడా ఆ అమ్మాయి, మానస్ చాలా మంచి ఫ్రెండ్స్ అని, ఇప్పటికీ వాళ్ళు మంచి స్నేహితులుగానే ఉన్నారని చెప్పారు.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మానస్ కి, లహరికి మధ్య ఏదో ట్రాక్ జరుగుతుంది.

అంతేకాకుండా ప్రియాంక సింగ్ కూడా అలా క్లోజ్ గా ఉండడంపై మానస్ తల్లి ఈ విధంగా స్పందించారు.నిజంగా చెప్పాలంటే ప్రియాంక సింగ్ చాలా కష్టపడి పైకి వచ్చిందని, తనకు ఆమె అంటే చాలా ఇష్టం అని ఆమె చెప్పారు.

అంతేకాకుండా మానస్ కేవలం తన మరదలు అని మాత్రమే చెప్పినట్టు ఆమె గుర్తు చేశారు.బిగ్ బాస్ సీజన్ లో ఇప్పటి వరకు ఎన్నో జంటలు బయటకు వచ్చాయి.

అవన్నీ కేవలం కంటెంట్ కోసం మాత్రమే అలా జరుగుతాయని ఆమె అన్నారు.

Telugu Bigg Boss, Love Story, Manas, Mother, Telugu-Movie

అంతే కాకుండా అక్కడ అంత కొద్దిమందే ఉన్నప్పుడు ఎవరో ఒకరితో మాట్లాడాలి కదా కాబట్టి అలా ఏదో క్రియేట్ అవుతుంది ఆమె చెప్పారు.అదీకాక మానస్ కి సరిపోయే అమ్మాయి ఆ హౌస్ లో ఎవరూ లేరని, తనకి కూడా అతనికి నచ్చుతుంది.సెట్ అవుతుంది.

అనేటట్టుగా ఎవరు అనిపించలేదని ఆమె చెప్పారు.ఆడవాళ్లకు ఆడవాల్లే శత్రువులు అంటారు గానీ, నిజానికి తాను ఆడవాళ్లకు ఎప్పుడు అండగా నిలుస్తానని ఆమె తెలిపారు.

అలాగే ప్రియాంక సింగ్ కూడా ఏదైనా సహాయం కావలసి వచ్చినప్పుడు తాను కచ్చితంగా చేస్తానని ఆమె స్పష్టం చేశారు.ఎందుకంటే తనకు ఆమె అంటే చాలా ఇష్టమని అని ఆమె వివరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube