‘మనం’ దర్శకుడిని వెంటాడుతున్న అశ్వినీదత్‌  

Manam Director Vikram K Kumar To Pay Penalty To Ashwini Dutt -

అక్కినేని ఫ్యామిలీతో ‘మనం’ అనే విభిన్నమైన చిత్రాన్ని తెరకెక్కించి సక్సెస్‌ను దక్కించుకున్న దర్శకుడు విక్రమ్‌ కుమార్‌తో అప్పట్లోనే అశ్వినీదత్‌ ఒక చిత్రం చేయాలని ప్లాన్‌ చేశాడు.అందుకోసం విక్రమ్‌ కుమార్‌కు కొంత మొత్తంలో పారితోషికం అడ్వాన్స్‌ కూడా ఇచ్చాడు.

అయితే సంవత్సరాలు గడిచి పోతున్నా కూడా ఇప్పటి వరకు వైజయంతి మూవీస్‌లో విక్రమ్‌ కుమార్‌ మూవీ చేయక పోవడంతో అశ్వినీదత్‌ అడ్వాన్స్‌ను తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాడట.అయితే విక్రమ్‌ కుమార్‌ మాత్రం తనకు ఇంకాస్త సమయం కావాలని, వచ్చే ఏడాది వరకు ఒక సినిమాను చేస్తానంటూ ఉన్నాడట.

‘మనం’ దర్శకుడిని వెంటాడుతున్న అశ్వినీదత్‌-Movie-Telugu Tollywood Photo Image

ఇలా రెండు సంవత్సరాలుగా చెబుతునే ఉన్నావని, ఇకపై తాను ఆగను అంటూ దర్శకుడు విక్రమ్‌ కుమార్‌కు అశ్వినీదత్‌ తేల్చి చెప్పాడు.అయితే ఇప్పుడు తన వద్ద డబ్బు లేదని, తాను ఇవ్వలేను అంటూ చెప్పడంతో అశ్వినీదత్‌ పెద్ద మనుషుల వద్దకు వెళ్లాడు.తెలుగు నిర్మాతల మండలికి ఈ వివాదం చేరడంతో అక్కడ ఈ విషయాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.విక్రమ్‌ కుమార్‌ వెంటనే వైజయంతి మూవీస్‌లో సినిమా చేయాలని, లేదంటే పారితోషికంగా తీసుకున్న అడ్వాన్స్‌ను ఇవ్వాలని ఆదేశించారు.

నిర్మాతల మండలి పెద్దల వద్ద కూడా తన వద్ద డబ్బు లేదని విక్రమ్‌ కుమార్‌ చెప్పడంతో విక్రమ్‌ కుమార్‌ తదుపరి ఎవరి నిర్మాణంలో అయితే సినిమా చేస్తాడో వారు అశ్వినీదత్‌కు ఇచ్చేలా నిర్మాతలు ఒప్పందం కుదిర్చారు.

విక్రమ్‌ కుమార్‌ తీసుకున్న అడ్వాన్స్‌ను వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది.అయితే విక్రమ్‌ కుమార్‌ తదుపరి చిత్రం ఇప్పట్లో ప్రారంభం అయ్యే సూచనలు కనిపించడం లేదు.తెలుగులో ఈయన అల్లు అర్జున్‌తో సినిమా చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.

అయితే బన్నీ మాత్రం త్రివిక్రమ్‌తో సినిమాకు రెడీ అయ్యాడు.త్రివిక్రమ్‌ మూవీ పూర్తి అయిన తర్వాత విక్రమ్‌ కుమార్‌ మూవీకి బన్నీ ఓకే చెప్తాడేమో.

అప్పుడు అశ్వినీదత్‌ అడ్వాన్స్‌ తిరిగి వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Manam Director Vikram K Kumar To Pay Penalty To Ashwini Dutt Related Telugu News,Photos/Pics,Images..

footer-test